Begin typing your search above and press return to search.

బుమ్రా కోసమా ఆ చూపులు?

By:  Tupaki Desk   |   24 Feb 2020 7:00 AM GMT
బుమ్రా కోసమా ఆ చూపులు?
X
సినిమా హీరోయిన్లకు టీమ్ ఇండియా క్రికెటర్లకు మధ్య ఉండే పరస్పర ఆకర్షణ ఈనాటిది కాదు. బ్లాక్ అండ్ వైట్ కాలం నాటిది. పాత ఉదాహరణ చెప్పుకోవాలంటే ఈ జెనరేషన్ బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ నానమ్మ షర్మిలా టాగోర్.. తాతయ్య మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ జమానాకు పోవాల్సి ఉంటుంది. షర్మిలా టాగోర్ అప్పట్లో టాప్ లీగ్ బాలీవుడ్ హీరోయిన్. మన్సూర్ అలీ ఖాన్ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్.. పైగా పటౌడీ రాజవంశీకులు. ఇద్దరి లవ్ స్టోరీ అప్పట్లో ఫేమస్ అంట!

అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ సినిమా-క్రికెట్ కాంబో సంప్రదాయం ఎవరో ఒక ప్రేమ జంట కొనసాగిస్తూనే ఉన్నారు. ఈమధ్యటీమ్ ఇండియా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాకు సౌత్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు మధ్య ప్రేమాయణం సాగుతోందని తెగ వార్తలు వచ్చాయి.. అయితే సౌత్ లో ఉండే ఈ బ్యూటీ ఆ నార్త్ బౌలర్ ను ఎలా క్లీన్ బౌల్డ్ చేసిందనేది మాత్రం ఎవరికీ అంతు చిక్కలేదు. ఇద్దరి గురించి నెటిజన్లకు ఎక్కడ అనుమానం వచ్చిందంటే.. అనుపమను సోషల్ మీడియాలో ఫాలో ఫాలో అనడమే కాకుండా అను ఏ పోస్ట్ పెట్టినా బుమ్రా కళ్ళు మూసుకుని లైక్.. లైక్ అంటున్నాడట. ఇక అనుపమ కూడా తక్కువ తినలేదని.. బుమ్రా పోస్టులకు తెగ లైకులు కొడుతోందట. దీంతో నెటిజన్ల బుర్రల్లో అనుమానాలు రేకెత్తాయి.

ఇప్పటికే అనుపమ-బుమ్రాలు డేటింగ్ లో ఉన్నారని.. ఎఫైర్ సాగుతోందని ముంబై మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. అయితే అందరూ ఏదో జరిగి పోతోందని ఊదర గొట్టడమే తప్ప ఇద్దరూ అచ్చికబుచ్చికలాడుకుంటూ ఒకరినొకరు మచ్చిక చేసుకునే ఫోటోలు మాత్రం బయటకు రానే లేదు. మరి అంత రహస్యంగా ప్రేమించుకోవడం ఎలానో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇదిలా ఉంటే చాలా మంది నెటిజన్లు మాత్రం ఇద్దరూ ప్రేమపావురాలు అని పండుగాడిలా మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు. అనుపమ అందంగా తయారైతే చాలు.. బుమ్రా కోసమేనా.. బుమ్రా కోసమా ఆ ఎదురుచూపులు అంటూ తమ కామెంట్ల తో ఆటపట్టిస్తున్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. ఈ ప్రేమ సంగతి నిజమే అయితే.. త్వరలోనే తెలుస్తుంది లెండి. రామజోగయ్య భయ్యాగారు చెప్పినట్టు ప్రేమ వచ్చినా.. తుమ్ము వచ్చినా అస్సలు ఆపలేం!