బాలీవుడ్ గుసగుసలు కాస్త చెవిన వేసుకో జాన్వీ!

Wed Nov 24 2021 09:29:50 GMT+0530 (IST)

Janvi Kapoor Movies does it only in Karan banners

బాలీవుడ్ లో చాలా మంది నిర్మాతలు ఉన్నారు. వందల కోట్ల బడ్జెట్ తో భారీ చిత్రాలను నిర్మిస్తూ వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సెట్ చేసినవాళ్లున్నారు. కానీ అందరిలోకి కరణ్ జొహార్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. అందుకు కారణం తనని తాను ప్రమోట్ చేసుకోవడం ఎలాగో .. ఎప్పుడూ మీడియా కంట్లో .. జనం నాలుకలపై నానడం ఎలాగో ఆయనకి బాగా తెలుసు.హిందీలో స్టార్ కిడ్స్ ను పరిచయం చేయడానికి ఆయన మొదటి నుంచి ఉత్సాహాన్ని చూపిస్తూనే వస్తున్నారు. ఎందుకంటే స్టార్స్ క్రేజ్ వారి వారసుల సినిమాలకి ఫస్టు ప్రమోషన్ గా ఉపయోగపడుతుంది.

సినిమా విడుదలైన తరువాత కథాకథనాల సంగతి ఎలా ఉన్నా రిలీజ్ కి ముందు ఆ సినిమాను గురించి అంతా మాట్లాడుకునేలా చేస్తుంది. జనాలను థియేటర్స్ కి రప్పిస్తుంది. ఇక స్క్రిప్ట్ సంగతి ఎలా ఉన్నా తమ వారసుల సినిమాలకి కావాల్సినంత పబ్లిసిటీ చేయడమెలాగో కరణ్ కి బాగా తెలుసును గనుక ఆయన బ్యానర్ కి అప్పగించడానికి వాళ్లు ఆసక్తిని చూపుతుంటారు. అలా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా కరణ్ కోటలో నుంచే మొదటి అడుగు బయటపెట్టింది. మరాఠీ హిట్ మూవీ 'సైరాట్' రీమేక్ గా 'ధడక్' తో ఆమె బాలీవుడ్ తెరకి పరిచయమైంది.

శ్రీదేవికి గల క్రేజ్ .. తెరపై ఆమె కూతురు ఎలా చేసింది అనే కుతూహలం ఈ సినిమాకి కొంతవరకూ హెల్ప్ అయ్యాయి. ఆ తరువాత ఆమె ఇతర నిర్మాతల సినిమాలు చేసినప్పటికీ కరణ్ సినిమాలకి ఇస్తున్న ప్రాధాన్యత ఎక్కువ. అయితే కరణ్ కి మొదటి నుంచి కూడా శ్రీదేవి కుటుంబంతో గల సాన్నిహిత్యం కారణంగా జాన్వీతో ఎక్కువ సినిమాలు తీస్తూ వస్తున్నారు.

తాజాగా ఆ జాబితాలో 'దోస్తానా 2' .. 'మిస్టర్ అండ్ మిసెస్ మహీ' సినిమాలు చేరిపోయాయి. దాంతో తాను సినిమాలు చేస్తున్నాడు గనుక జాన్వీని తీసుకుంటున్నాడా? లేకపోతే జాన్వీ కోసమే సినిమాలు ప్లాన్ చేస్తున్నాడా? అని బాలీవుడ్లో గుసగుసలాడుకుంటున్నారు.

చిత్రపరిశ్రమలో ఎప్పుడూ కూడా పరిచయాలను పెంచుకుంటూ .. అవకాశాలను అందుకుంటూ ముందుకువెళుతూ ఉండాలి. ఒకే బ్యానర్లో వరుస సినిమాలు చేస్తూ కూర్చోవడం మంచిది కాదనే సత్యాన్ని గతంలో చాలామంది హీరోయిన్ల కెరియర్లు చెప్పాయి. 'తను కరణ్ బ్యానర్లలోమాత్రమే చేస్తుంది' అనే ఒక టాక్ బయటికి వెళితే కష్టమే.

పోనీ ఇంతవరకూ ఆమె ఆ బ్యానర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన ఏమైనా ఒరిగిందా అంటే అదీ లేదు. ఈ విషయం పెద్ద నిర్మాతగా బోనీ కపూర్ కి తెలియనిదేమీ కాదు. తన కూతురుతో తన బ్యానర్ పై సినిమాలు చేసే సత్తా లేకా కాదు. కానీ ఆమె కెరియర్ ను నిలబెట్టే విషయంలో ఆయన ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారనేదే ఎవరికీ అర్థం