తెల్ల తెల్లాని చీర.. జారుతున్న పరువాల ధార..

Fri May 29 2020 08:00:02 GMT+0530 (IST)

million volts in white saree!

యువనటి జాన్వీ కపూర్ తెలుసు కదా.. అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు. ‘ధడక్’ అనే సినిమాతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దర్శకుడు కరణ్ జోహార్ నిర్మించాడు. అయితే ఈ సినిమా మరాఠిలో సూపర్ హిట్ అయిన ‘సైరాత్’ సినిమాకు రీమేక్‌గా రూపొందింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో జాన్వీ ఫుల్ పాపులర్ అయిపోయింది. ఎప్పుడు చూసినా నాన్న కూచి అమ్మ కొంగుచాటు బిడ్డలా కనిపించిన జాన్వీ.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. అదెలాగో అని ఆశ్చర్యపోకండి.. తన అందాలతో బాలీవుడ్ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకొని.. అమాంతంగా అభిమానులను సంపాదించుకుంది. చేసింది ఒక్క సినిమా అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం మాములుగా లేదు. జాన్వీ శ్రీదేవి కూతురు అన్నట్లే గాని తనకు తానుగా నిలదొక్కుకోవడానికి విపరీతంగా ట్రై చేస్తుంది.ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. సోషల్ మీడియాలో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. నిత్యం తన అందాలను ఆరబోసే ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలలో నటిస్తూ బిజీ అవుతుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. ‘కార్గిల్ గాళ్’ ‘రుహీ అఫ్జా’ ‘తక్త్’ సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉండగా జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. అంతేకాదు చీరకట్టి పరువపు అందాలతో ఎప్పటికప్పుడూ ఫోటో షూట్‌లు చేస్తూ.. సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది. చీరకట్టులో జాన్వీ అందాలను చూసిన నెటిజన్లు లైకులు షేర్లతో తెగ హల్ చల్ చేస్తున్నాయి. తెల్ల చీరలో స్టైల్ గా నిలబడి కుర్ర హృదయాలకు వేగం పెంచుతోంది. ఇక మరో వైపు జాన్వీ సౌత్‌లో నటించడానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. చూడాలి మరి తెల్లచీర అమ్మడు.. తెరమీదకు ఎప్పుడో..!