ఈ కొంటె జిగేల్ రాణిని టాలీవుడ్ లో దించేదెపుడు?

Thu Oct 21 2021 15:03:27 GMT+0530 (IST)

Janhvi Kapoor shared Beautiful Pic In Instagram

అతిలోక సుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్ హాటెస్ట్ ఫోజులు నిరంతరం యువతరంలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ నవతరం నాయిక చాలా రేర్ గానే ట్రెడిషనల్ లుక్స్ లో కనిపిస్తుంది. జిమ్ కి వెళ్లినా..యోగ సాధనలో ఉన్నా.. పబ్లిక్ మార్కెట్లో కనిపించినా.. టెంప్టింగ్ లుక్ తో ఆకర్షించడం తనకే చెల్లింది. ఇటీవల వరుస ఫోటోషూట్ల తో కుర్రాళ్ల గుండెల్లో మంటలు పుట్టిస్తోంది. ఇన్ స్టా వేదికగా వేడెక్కించే ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా జాన్వీ మినీ ఫ్రాక్ లో జివ్వనిపించింది. జాన్వీ ఎద అందాల్ని ఎలివేట్ చేస్తూ డిజైనర్ డ్రెస్ కేక పెట్టిస్తోంది.ప్రస్తుతం ఈ ఫోటోషూట్ యువతరం లో వైరల్ గా మారింది. జాన్వీ ఫాలోవర్స్ హాట్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. జిగేల్ రాణిలా జివ్వనిపిస్తోంది! అంటూ యూత్ ఒకటే కామెంట్లతో విరుచుకపడుతున్నారు. ఇక ఇదే ఫోటోషూట్ లో తన కొలీగ్ సారా అలీఖాన్ తో వేరొక ఫోటోషూట్ అంతే వైరల్ గా మారుతోంది. ఇక జాన్వీ టూ పీస్.. బికినీ ల్లో ఎక్స్ ఫోజింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పూల్ సైడ్ ..బీచ్ ఇసుకల్లో చిట్టి పొట్టి దుస్తుల్లో చాలాసార్లు కనువిందు చేసింది.

ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుత ఉత్తరాదిన బిజీ నాయిక. కరణ్ జోహార్ బ్యానర్లో `దోస్తానా-2` లో నటిస్తోంది. అదే బ్యానర్ లో మరో రెండు చిత్రాలు కమిట్ అయింది. అలాగే `గుడ్ లక్ జెర్రీ` షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. `మిలీ` అనే మరో చిత్రంలో కూడా నటిస్తుంది. వచ్చే ఏడాది ఆ సినిమా రిలీజ్ కానుంది. ఇక దక్షిణాదిన ఎంట్రీ ఇవ్వడానికి జాన్వీ ఆసక్తిగానే ఉంది. కానీ సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుంది. ఆ ఛాన్స్ వస్తే వదులుకోవడానికి ఎంత మాత్రం సిద్దంగా లేదు. తల్లి తరహాలోనే అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలని ప్రణాళికతో ముందుకు వెళుతోంది.

టాలీవుడ్ అగ్ర హీరోల కన్ను పడే టైమొచ్చిందా

మెగా కాంపౌండ్ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఆరంగేట్రం చేస్తుందని ఇంతకుముందు కథనాలొచ్చాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో చరణ్ సరసన నటించేందుకు ఆస్కారం ఉందని చాలా కాలంగా ప్రచారం ఉంది. అయితే ఈ సినిమాని తెరకెక్కించాలని అశ్వనిదత్ ప్రయత్నించినా ఎందుకనో కుదరలేదు. ఇటీవల కొంతకాలంగా మహేష్ నటించే తదుపరి చిత్రంలో జాన్వీ కపూర్ నటిస్తుందని ఈ సినిమా తనకు టాలీవుడ్ ప్రవేశ చిత్రం అవుతుందని రకరకాల కథనాలొచ్చాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఇప్పుడు వేరొక నాయిక పేరు వినిపిస్తోంది.

జాన్వీ చరణ్ తో కాదు .. మహేష్ తో కానే కాదు.. బన్నీతో ఎంట్రీ ఇస్తుంది! అంటూ మరో కొత్త పుకార్ కూడా ఇటీవల షికార్ చేస్తోంది. అల్లు అర్జున్ సరసన జాన్వీ తెలుగు తెరకు పరిచయం అవుతుందని ఒకటే గుసగుస వినిపిస్తోంది. మామ్ శ్రీదేవి అడుగుజాడల్లో తెలుగు సినీపరిశ్రమలో సత్తా చాటాలని జాన్వీ ఉవ్విళ్లూరుతోందిట. అల్లు అర్జున్ నటించనున్న ఐకాన్ లో జాన్వీ నటించే వీలుందని కథనాలొచ్చినా ఇంతవరకూ నాయిక ఎవరు అన్నది ప్రకటించలేదు.

ఇక ఈ మూవీకి కొత్త ముఖాల్ని వెతికే క్రమంలో అల్లు అరవింద్ పలువురు బాలీవుడ్ యువ నాయికల పేర్లను పరిశీలించారు. అందులో సారా అలీఖాన్ .. జాన్వీ కపూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయని టాక్ వినిపించింది. ఇక త్వరలోనే తెలుగులో డెబ్యూ నటిగా పరిచయం కావాలని ఉవ్విళ్లూరుతున్న ఖుషీ కపూర్ పేరును.. లైగర్ బ్యూటీ అనన్య పేరును కూడా అనుకున్నారట. అయితే అందరి దృష్టి చివరికి జాన్వీ కపూర్ ని వీడి వెళ్లడం లేదని తన డెబ్యూ ఖాయమైనట్టేనని గుసగుసలు వినిపించాయి. ఇప్పటికే జాన్వీ పీఆర్ తో దర్శకుడు వేణు శ్రీరామ్.. నిర్మాత దిల్ రాజు టచ్ లో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఐకాన్ కి ఎంపికయ్యే ఛాన్సుందని చెబుతున్నారు. ఐకాన్ త్వరలో ప్రారంభం కానుంది. చరణ్ .. మహేష్ తో కుదరలేదు కానీ ఇక బన్నీతో అయినా కన్ఫామ్ అయినట్టేనా?