నాభిలో ముత్యం.. మెడలో హారంతో కిల్లర్ బ్రైడ్

Thu Sep 16 2021 16:00:01 GMT+0530 (IST)

Janhvi Kapoor Shows Off Her Stunning Beauty

నాభిలో ముత్యం.. మెడలో హారం.. గుండెల్ని కోసేసే క్రీగంటి చూపులతో కిల్లర్ బ్రైడ్ ఎవరై ఉంటారు? ప్రత్యేకించి చెప్పాలా? అతిలోక సుందరి ముద్దుల తనయ జాన్వీకపూర్ అది. తన పబ్లిక్ అప్పియరెన్స్ వరుస ఫోటోషూట్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇన్ స్టా వేదికగా టెంప్టింగ్ ఫోటోలు వీడియోలతో ఎప్పటికప్పుడు హీటెక్కిస్తూనే ఉంటుంది. జిమ్..యోగా సెషన్లతో పాటు స్కిన్ టైట్ వస్త్రధారణతో జాన్వీ సమ్ థింగ్ స్పెషల్ అని ప్రూవ్ చేసింది. తాజాగా బ్రైడల్ ఏషియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం జాన్వీ మరోసారి మనోహరిలా మారిపోయింది. ఔరా అనిపించే లెంహంగా లుక్ లో కట్టిపడేస్తోంది. మిరిమిట్లు గొలిపే డిజైనర్ దుస్తుల్లో హీట్ పెంచుతోంది.రకరకాల దుస్తుల్లో జాన్వీ కనిపించింఇ. ఇందులో నీలిరంగు ఎంబ్రాయిడరీ దుస్తుల్లోనూ మరో ఫోజు ఆకట్టుకుంది. అద్భుతమైన స్వీక్లైన్డ్ బ్లూ గౌనులో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మెడలో రూపాయి బిళ్లలంతా డిజైన్డ్ నెక్లెస్ ని ధరించింది. వెనుక సెట్ డిజైన్ షేడ్ ఎలివేషన్ లో జాన్వీ మరింత హైలైట్ గా కనిపిస్తోంది

ఇంత అందమైన ప్రొఫెషనల్ డిజైనర్ లుక్ వెనుక ఎవరు ఉన్నారంటే? స్టార్ డిజైనర్ రాహుల్ మిశ్రా. ఆయనే ఈ డ్రెస్ ని ఇంత అందంగా డిజైన్ చేసారు. ప్రస్తుతం ఈ కవర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో జాన్వీ చాలా కవర్ పేజీల కోసం ఫోజులిచ్చింది. కానీ లెహంగా లుక్ లో ఫోజులివ్వడం ఇదే తొలిసారి. దీంతో నెటి జనులు ఆసక్తికర కామెంట్లు గుప్పిస్తున్నారు. ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కరణ్ జోహార్ బ్యానర్లో `దోస్తానా-2`లో నటిస్తోంది. అదే బ్యానర్ లో మరో రెండు చిత్రాలు కమిట్ అయింది.

అలాగే అమ్మడు నటించిన `గుడ్ లక్ జెర్రీ` సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. `మిలీ` అనే మరో చిత్రంలో కూడా నటిస్తుంది. వచ్చే ఏడాది ఆ సినిమా రిలీజ్ కానుంది. ఇక దక్షిణాదిన ఎంట్రీ ఇవ్వడానికి జాన్వీ ఆసక్తిగానే ఉంది. కానీ సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తుంది. ఆ ఛాన్స్ వస్తే వదులుకోవడానికి ఎంత మాత్రం సిద్ధంగా లేదు. తల్లి తరహాలోనే అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలని ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.

బోనీ-కరణ్ గుడ్ ప్లానింగ్..

కెరీర్ పరంగా ఎదురేలేని పొజిషన్ లో ఉన్న జాన్వీ కపూర్ తన స్టార్ డమ్ ని మరో లెవల్ కి తీసుకెళ్లే ప్లాన్ లో ఉంది. ప్రస్తుతం నటవారసురాలిపై సౌత్ ఇండస్ట్రీ కళ్లు కూడా ఉన్నాయి. ఇటీవల టాలీవుడ్ కోలీవుడ్ సహా సౌతిండస్ట్రీస్ లో జాన్వీ కపూర్ పేరు మార్మోగిపోతోంది అంటే అందుకు తన స్పీడ్ ప్రధాన కారణం. పాపా బోనీ కపూర్ ఇప్పటికే తెలుగులో ప్రముఖ బ్యానర్లతో టచ్ లో ఉన్నారు. తన కుమార్తెలు జాన్వీ కపూర్ .. ఖుషీ కపూర్ లకు ఇక్కడ లైన్ క్లియర్ చేస్తున్నారు. పనిలో పనిగా జాన్వీ- ఖుషీ సిస్టర్స్ కెరీర్ ని పీక్స్ కి తీసుకెళ్లేందుకు ధర్మ ప్రొడక్షన్స్ అధినేత డీసీఏ కర్త కరణ్ జోహార్ తనవంతు సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇటీవల వేడెక్కించే ఫోటోషూట్ల వెనక కరణ్ ప్రోద్బలం ఎంతైనా ఉందని అంతా భావిస్తున్నారు. మొత్తానికి డాడీ బోనీ.. గురువు కరణ్ క్యూట్ కిడ్స్ ని స్టార్లు గా మలిచేందుకు అవసరమైన అన్ని ఎత్తుగడలతో వేడెక్కిస్తున్నారని కథనాలొస్తున్నాయి. ప్రస్తుతం జాన్వీ కిల్లర్ లుక్ అంతర్జాలాన్ని షేక్ చేస్తూ ఏకే 47 నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ లా దూసుకెళుతోంది.