జాన్వీకి తెలుగుపై కాదు మలయాళంపై ఆసక్తి!

Thu Oct 28 2021 12:01:58 GMT+0530 (IST)

Janhvi Kapoor Revealed in a recent interview

అతిలోక సుందరి శ్రీదేవి గారాల పట్టీ జాన్వీ కపూర్ త్వరలోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోందని ఇటీవల ప్రచారమైంది. మహేష్ .. చరణ్ .. బన్ని లేదా దేవరకొండ సరసన ఈ బ్యూటీ నటించేందుకు ఆస్కారం ఉందని కథనాలొచ్చాయి. కానీ ఇవేవీ నిజాలు కాదని తాజా పరిణామం చెబుతోంది. జాన్వీ ఇప్పటివరకు ఏ సౌత్ ఇండియన్ సినిమాకి ఎందుకు సంతకం చేయలేదో తాజా ఇంటరవ్యూలో వెల్లడించిందిబాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నా ఇంకా తనవైపు అంతగా వ్వావ్ అనిపించే స్క్రిప్ట్ ఏదీ రాలేదని జాన్వీ తెలిపింది. గతంలో చాలా ఆఫర్లతో పలువురు దక్షిణాది దర్శకనిర్మాతలు తనను సంప్రదించారు. కానీ ఇంకా ఏ సౌత్ ఇండియన్ సినిమాకి సైన్ చేయలేదు. కొందరితో మాట్లాడాను.. కానీ ``ఓ మై గాడ్.. నేను దీన్ని చేయాలి`` అనిపించలేదని సూటిగా అసలు కారణం చెప్పేసింది. దక్షిణాది చిత్రాలకు విపరీతమైన అభిమానినే కానీ.. నటించేందుకు సరైన స్క్రిప్టు రాలేదని అంగీకరించింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ చూస్తున్నా. చరిత్ర.. మలయాళ సినిమాలకు ప్రాధాన్యతనిస్తున్నానని తెలిపింది. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కి జాన్వీ వీరాభిమాని. ఇటీవల ఫహద్ నటించిన ట్రాన్స్ సినిమాని చూశానని అందులో అతను అద్భుతంగా నటించాడని జాన్వీ అభిప్రాయపడింది. మలయాళ చిత్ర పరిశ్రమను కూడా అన్వేషించాలనుకుంటున్నట్లు జాన్వీ ఒప్పుకుంది. తాజా సన్నివేశాన్ని బట్టి దక్షిణ భారత సినిమాల్లో జాన్వీ అరంగేట్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు మరికొంత కాలం వేచి ఉండాల్సిందే. ముఖ్యంగా తెలుగులో ఇప్పుడే ఎంట్రీ లేదని క్లారిటీ వచ్చేసినట్టే. తన ఆసక్తిని గమనిస్తుంటే తెలుగు కంటే మలయాళం తన తొలి ప్రాధాన్యత అని అర్థమవుతోంది. కానీ మామ్ శ్రీదేవి మాత్రం జాన్వీ తెలుగు-తమిళ్ లోనూ తనలాగే పెద్ద స్టార్ అవ్వాలని కోరుకున్నారు. ఆ కోరికను ఫుల్ ఫిల్ చేసేందుకు అయినా ఇటువైపు దృష్టి సారిస్తుందేమో చూడాలి.

బాలీవుడ్ లో జాన్వీ ప్రస్తుతం దోస్తానా 2 .. గుడ్ లక్ జెర్రీ చిత్రాలలో నటిస్తోంది. ఇటీవల `మిలి` షూటింగ్ లో బిజీగా ఉంది. డెహ్రాడూన్ లో చిత్రీకరణ జరుగుతుంది. `మిలి` మలయాళం సినిమా` హెలెన్` కి రీమేక్ గా తెరకెక్కుతోంది.

పారా అథ్లెట్ బయోపిక్ చేస్తుందట

2021 టోక్యో ఒలిపింక్స్ లో భారత్ పేరు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది. పతకాల పట్టికలో కాస్త మెరుగైన స్థానం సంపాదించినంది. పారా ఒలిపింక్స్ లోనూ భారత్ దూకుడు ప్రదర్శించింది. దీంతో తవ్వితే ఎంతో మంది మట్టిలో మాణిక్యాల కథలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్ టోక్యో పారా ఒలిపింక్స్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన అరుణిమ సిన్హా జీవితకథలో నటించేందుకు ఆసక్తిగా ఉంది. సిన్హా సాధించిన విజయాల్ని కీర్తిస్తూ తన బయోపిక్ లో నటించాలని ఉందని మనసులో కోర్కోను బయట పెట్టింది.