జాన్వీ త్యాగం... ఎన్టీఆర్ క్రేజ్ కు ఇది ప్రత్యక్ష సాక్ష్యం

Tue Feb 07 2023 20:00:01 GMT+0530 (India Standard Time)

Janhvi Kapoor Rejected Bollywood Film For NTR30

అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు అయితే చేసింది.. చేస్తూనే ఉంది కానీ ఆశించిన స్థాయిలో ఇప్పటి వరకు సక్సెస్ లను దక్కించుకోవడం లో విఫలం అయ్యింది. థియేట్రికల్.. ఓటీటీ సినిమా.. వెబ్ సిరీస్ ల ద్వారా పాపులారిటీని సొంతం చేసుకోలేక పోయింది.  జాన్వీ కెరీర్ ఆరంభం నుండి కూడా సౌత్ ప్రేక్షకులు ఆమె ఇక్కడ నటించాలని కోరుకుంటున్నారు. కానీ ఆమె మొదట బాలీవుడ్ లో సినిమాలు చేయాలని ఆశించింది.. అక్కడ ఇన్నాళ్లు సినిమాలు చేసిన జాన్వీ కపూర్ టాలీవుడ్ లో మొదటి సినిమాకు ఓకే చెప్పింది. ఇప్పటికే ఎన్టీఆర్ 30 సినిమాకు ఈ అమ్మడు సైన్ చేసింది అనేది టాక్. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఒక సినిమా ను ఎన్టీఆర్ 30 సినిమా కోసం త్యాగం చేసిందట. కొరటాల శివ కాస్త ఎక్కువ డేట్లను జాన్వీ కపూర్ నుండి తీసుకున్నాడట. ఆ డేట్స్ లోనే బాలీవుడ్ నుండి ఒక ఆఫర్ వచ్చిందట. కానీ జాన్వీ కపూర్ ఆ సినిమాను తిరష్కరించి ఎన్టీఆర్ 30 సినిమా పైనే ఎక్కువ ఫోకస్ పెట్టిందనే వార్తలు వస్తున్నాయి.

అతిలోక సుందరి వారసురాలుగా జాన్వీ కపూర్ కు ఇప్పటికే సౌత్ లో మంచి డిమాండ్ ఉంది. ఇక ఎన్టీఆర్ సినిమాలో ఆమె నటిస్తే మంచి స్టార్ డమ్ దక్కే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఎన్టీఆర్ సినిమా కోసం ఏకంగా హిందీ సినిమాకే నో చెప్పిందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ క్రేజ్ కు ఇది ప్రత్యక్ష సాక్ష్యం అని.. ఎన్టీఆర్ తో సినిమా చేయాలని బాలీవుడ్ సినిమాను జాన్వీ వదులుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న ఎన్టీఆర్ 30 ని పాన్ ఇండియా మూవీగా రూపొందించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సౌత్ నుండి వస్తున్న పాన్ ఇండియా సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. కనుక ఎన్టీఆర్ కి జోడీగా జాన్వీ నటిస్తే కచ్చితంగా ఆమె కెరీర్ జిల్ జిల్ జిగా అన్నట్లుగా ఉండటం ఖాయం.   నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.