రెస్టారెంట్ లో జాన్వీ జీన్స్ లుక్ జిగేల్ !

Mon Jul 04 2022 05:00:01 GMT+0530 (IST)

Janhvi Kapoor Latest Photo

అతిలోక సుందరి శ్రీదేవి  డాటర్ గా వెండి తెరకి పరిచయమైన జాన్వీకపూర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. నటిగా అవాకాశాలతో బిజీగా ఉంది. మూడు పువ్వులు..ఆరు కాయలు అన్న చందంగా కెరీర్ సంతోషంగా సాగిపోతుంది. బ్యాక్ బోన్ గా నిలిచిన తండ్రి బోనీ కపూర్ సూచనలు..సలహాలు తీసుకుంటూ కెరీర్ ని ఉన్నతంగా తీర్చి దిద్దుకుంటుంది.తల్లి తరహాలోనే తనయ సైతం పాన్ ఇండియా వైడ్ ఫేమస్ అవ్వాలని టార్గెట్ గా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతానికి బాలీవుడ్ పైనే కాన్సంట్రేట్ చేసినా అమ్మడి ప్లానింగ్ అదేనన్నది సుస్పష్టం. ఇక జాన్వీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. నిత్యం  కొత్త ఫోటోలతో యువతని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

డిజైనర్  ఫ్యాషన్ ఎంపికలు సహా మోడ్రన్ గాళ్ల్ గా తనని తాను అందంగా ఆవిష్కరించుకునే ప్రయత్నం ప్రశంసనీయం.  తాజాగా అమ్మడు మరో కొత్త ఫోటోతో  సోషల్ మీడియాని  షేక్ చేస్తోంది.  ఇదిగో ఇక్కడిలా ఓ విదేశీ రెస్టారెంట్ లో బ్లూకలర్ జీన్స్ డిజైనర్ లో తళుక్కున మెరిసింది. ఆ జీన్స్ మహిమా?  లేక నిజంగా స్లిమ్ అయిందా? అన్నది క్లారిటీ లేదు గానీ..జాన్వీ మాత్రం స్లిమ్ లుక్ లో కనిపిస్తుంది.

ముఖం సహా చేతులు బాగా సన్నబడినట్లు..అనవసరంగా పేరుకుపోయే కోవ్వు భాగం ఎక్కడా కనిపించలేదు. హెవీ మ్యాకప్ తో పెదాలపై చిరు నవ్వులో  అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమ్మడి అభిమానులు లవ్ బుల్ కామెంట్లతో అభిమానం చాటుకుంటున్నారు.    

కెరీర్ మ్యాటర్ కి వస్తే... జాన్వీ కపూర్ వరుసగా విలక్షణ కథల్ని ఎంపిక చేసుకుని వైవిధ్యమైన సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. గుడ్ లక్ జెర్రీ తర్వాత లైనప్ లో రొమాంటిక్ కామెడీ `దోస్తానా 2` ఉంది. ఈ మూవీ నుంచి కార్తీక్ ఆర్యన్ వైదొలిగిన అనంతరం చిత్రీకరణకు సంబంధించిన అప్ డేట్ ని వెల్లడించలేదు. వరుణ్ ధావన్ తో కలిసి జాన్వీ మిలీ లో నటించింది.

ఈ చిత్రానికి 2019లో అసలు మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించిన మాతుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సన్నీ కౌశల్ -మనోజ్ పహ్వా కూడా నటించారు. జాన్వీ తండ్రి బోనీ కపూర్ ఈ మూవీ నిర్మాతల్లో ఒకరు కాగా.. ఇందులో బోనీ తన గారాల కుమార్తెతో కలిసి నటించడం విశేషం. ఇదే కాకుండా రాజ్ కుమార్ రావుతో `మిస్టర్ అండ్ మిసెస్ మహి` చిత్రంలోనూ జాన్వీ నటిస్తోంది. ఈ మూవీ కూడా విడుదలకు రానుంది. అలాగే బవాల్ అనే మరో చిత్రంలోనూ జాన్వీ నటిస్తోంది.