వేడి పెంచడంలో జాన్వీ తర్వాతే..!

Mon Jan 17 2022 18:01:17 GMT+0530 (India Standard Time)

Janhvi Kapoor Latest Photo

ఆరంభం ఈ అమ్మడి అందంపై పెదవి విరిచేశారు. అతిలోక సుందరి వారసత్వాన్ని నిలబెడుతుందా? అంటూ సందేహించారు. నటిగా శ్రీదేవి అంత పాపులరవుతుందా? అన్నారు. ధడక్ చిత్రంతో యావరేజ్ అన్నారు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా సీన్ మారిపోతోంది. ఒక్కోరోజు ఒక్కో విధంగా జాన్వీ కపూర్ రూపాంతరం యువతరంలో వేడి పుట్టిస్తోంది. ఇప్పుడు జాన్వీ అందం గురించి నటప్రతిభ గురించి ఎలాంటి సందేహాల్లోవ్.



కరీనా.. కత్రిన.. రేంజు అని నిరూపించుకునేందుకు దశాబ్ధం కెరీర్ ని రన్ చేయాల్సి ఉండొచ్చేమో కానీ నేటి జనరేషన్ లో జాన్వీ రేంజే వేరు. సాటి నటవారసురాళ్లకు ధీటుగా రాణిస్తోంది.  అలాగే జాన్వీకపూర్ ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. డిజైనర్ దుస్తుల్లో హీట్ పుట్టించడం ఈ బ్యూటీకి ఓ హాబీ. పొట్టి నిక్కర్లలో.. స్కిన్  టైట్ దుస్తుల్లో.. బికినీ లో కాకలు రేపడం ఈ బ్యూటీ ప్రత్యేకత. తాజాగా కొత్తరకం బికినీ ధరించి ఇన్ స్టాలో మంటలు రేపుతోంది. పింక్ కలర్ బికినీ ధరించి పూల్ సైడ్ కెమారాకి వివిధ భంగిమల్లో ఫోజులిచ్చింది. అయితే ఈ బికినీ రొటీన్ కి భిన్నం.  టాప్ టూ బాటమ్ లేయర్ లు గా ఉండే బికినీ లో కనిపించింది.

మరో ఫోటోలో జీన్స్ స్కర్ట్ ధరించి అందాల్ని ఎలివేట్ చేసింది. టాప్ లో ఇన్నర్ అందాల్ని ఆవిష్కరిస్తూ వైట్ లూజు షర్టు ధరించింది. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు ఇన్ స్టాని షేక్ చేస్తున్నాయి. జాన్వీ అభిమానులు  హాట్ కామెంట్లతో మరింత హీటెక్కిస్తున్నారు. ఓ నెటిజనుడు జాన్వీ పింక్ లో మరింత అందంగా కనిపిస్తుందని...అదీ వినూత్నమైన డిజైన్డ్ బికినీలో జాన్వీ అందాలు అద్భుతం అంటూ కామెంట్ చేసాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.

ఇక జాన్వీ  సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కరణ్ జోహార్ బ్యానర్లో  `దోస్తానా-2` లో  నటిస్తోంది. అదే బ్యానర్ లో మరో రెండు చిత్రాలు కమిట్ అయింది. అలాగే అమ్మడు నటించిన `గుడ్ లక్ జెర్రీ` సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది.
`మిలీ` అనే మరో చిత్రంలో కూడా నటిస్తుంది. వచ్చే ఏడాది ఆ సినిమా రిలీజ్ కానుంది. ఇక దక్షిణాదిన ఎంట్రీ ఇవ్వడానికి జాన్వీ ఆసక్తిగానే ఉంది. కానీ సరైన ప్రాజెక్ట్  కోసం ఎదురుచూస్తుంది. ఆ ఛాన్స్ వస్తే వదులుకోవడానికి ఎంత మాత్రం సిద్దంగా లేదు. తల్లి తరహాలోనే అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలని ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.