`ధడక్` బ్యూటీ దడ పుట్టిస్తోందిగా

Mon Nov 29 2021 20:40:58 GMT+0530 (IST)

Janhvi Kapoor Latest Photo

`ధడక్` చిత్రంతో బాలీవుడ్ కి పరిచయమైన అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్ కెరీర్  సక్సెస్ లపై సక్సెస్ ల్ని సొంతం చేసుకుని ముందుకి సాగిపోతుంది.   తండ్రి బోనీ కపూర్ సూచనలు..సలహాలు పాటిస్తూ కెరీర్  స్ర్టాంగ్ బిల్డ్ చేసుకుంటోంది. ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ కూడా జాన్వీ కెరీర్ విషయంలో ఎంతో శ్రద్ద తీసుకుంటున్నారు. తన నిర్మాణ సంస్థలోనే వరుసగా సినిమాలు చేసేలే అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం అదే బ్యానర్లో రెండు..మూడు సినిమాల కమిట్ మెంట్లు ఉన్నాయి.  ఇలా కెరీర్ పరంగా వెనక్కి తీరిగి చూసుకునే పనిలేదు. దక్షిణాది చిత్రాల్లోనూ లాంచ్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే బోనీ కపూర్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాతనే ఇతర భాషల్లో లాంచ్ చేయించాలని చూస్తున్నారు. ఆ సంగతి పక్కనబెడితే జాన్వీ ఫోటో షూట్ల గురించి తెలిసిందే. స్టైలిష్ ఐకానిక్ గాళ్ల్ గా ఫోకస్ అవ్వడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంది. డిజైన్ వస్ర్తాల్లో తళుక్కున మెరుస్తూ చూపరులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటుంది.

తాజాగా అమ్మడు మరోసారి  మెరుస్తోన్న బ్లాక్ కోట్  ధరించి కెమారాకి ఫోజులిచ్చింది. మత్తెక్కించే చూపులతో కెమెరా కన్నునే లాక్ చేసింది. పెదవులకు గులాబీ రంగు లిప్ స్టిక్..కురులను గాలికి వదిలేసి..ముఖాన్ని షోల్డర్ కి అంటిపెట్టి కెమారాకి ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. జాన్వీ అభిమానులు హాట్ కామెంట్లతో ఎటాక్ షురూ చేసారు. ప్రస్తుతం  జాన్వీ  కపూర్ సినిమాల లైనప్ చూస్తే `దోస్తానా2 `లో నటిస్తోంది. అలాగే  `గుడ్ లక్ జెర్రీ`..`మిలీ` చిత్రాల షూటింగ్ ని పూర్తిచేసింది. త్వరలో అవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.