పొట్టినిక్కరుతో అలా .. ఫుల్ ఫ్యాంటుతో ఇలా.. ఏంటో జాన్వీ?

Sat Oct 24 2020 12:45:04 GMT+0530 (IST)

Janhvi Kapoor Latest Look

పొట్టినిక్కరుతో అలా .. ఫుల్ ఫ్యాంటుతో ఇలా.. ఏంటో జాన్వీ?.. యూత్ కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిస్తోంది నిరంతరం. ఈ అమ్మడు ధడక్ సినిమాలో నటించిన తర్వాత కెరీర్ పరంగా వెనుదిరిగి చూసిందే లేదు. నెపోటిజం స్టార్లకు ఏమాత్రం అవకాశాలు తగ్గకుండా పూలరంగడు కరణ్ జోహార్ అండగా నిలుస్తున్న సంగతి తెలిసినదే. ముఖ్యంగా తన ఫ్రెండు శ్రీదేవి కోసం జాన్వీ.. ఖుషీ ల కెరీర్ బాధ్యతను ఆయనే తీసుకున్నాడు మరి.ఇప్పటికిప్పుడు దోస్తానా.. తఖ్త్ అంటూ భారీ చిత్రాల్లో జాన్వీని లాక్ చేశాడు. అలాగే ఇతర బ్యానర్ సినిమాలకు కమిట్ చేయించేస్తున్నాడు. అసలు జాన్వీ కెరీర్ ఆరేడేళ్ల పాటు డోఖా లేనంతగా డిజైన్ చేశాడు జోహార్ భాయ్. ఇక ఆ కాన్ఫిడెన్స్ ప్రతిసారీ జాన్వీ లుక్స్ లో కనిపిస్తుంటుంది. ఎదురే లేని క్వీన్ గా వెలిగిపోయేందుకు సత్తా చాటేందుకు జాన్వీ ఎంతో హార్డ్ వర్క్ చేస్తోంది.

ఫిజికల్ ఫిట్నెస్ పరంగానూ ఈ అమ్మడు ఎందులోనూ తగ్గడం లేదు. నిరంతరం జిమ్ యోగా సెషన్స్ ని అస్సలు విడిచిపెట్టదు. అయితే కోవిడ్ వల్ల ఇటీవలి కాలంలో జాన్వీ ట్రీట్ కాస్త తగ్గింది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ప్రపంచం బాంద్రాలో ఆరుబయట స్వేచ్ఛగా తిరిగే ప్రయత్నం చేస్తోంది. ఆ క్రమంలోనే ఇదిగో జాన్వీ ఇలా ఆరుబయట ప్రత్యక్షమైంది. ఓసారి పొట్టినిక్కరుతో ఇంకోసారి ఫుల్ ఫ్యాంటుతో అదిరే ట్రీటిచ్చింది అభిమానులకు. ఇకపై నిరంతర ట్రీట్ కి రెడీ కమ్మని సిగ్నల్ ఇచ్చేసినట్టే మరి.