శ్రీదేవి కూతురు అనిపించిందిగా..!

Wed Jan 23 2019 13:19:41 GMT+0530 (IST)

అతిలోకసుందరిగా ప్రేక్షకులతో నీరాజనాలు అందుకున్న శ్రీదేవి ఒక్కఅందం విషయంలోనే కాకుండా నటన.. డ్యాన్స్ విషయంలో కూడా అందరినీ మెస్మరైజ్ చేసేది. అందుకే హీరోలు డామినేట్ చేసే ఫిలిం ఇండస్ట్రీలో తొలి లేడీ సూపర్ స్టార్ గా నిలిచింది. శ్రీదేవి వారాసురాలిగా ఆమె పెద్ద కూతురు జాన్వి పోయినేడాది హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  మొదటి సినిమా 'ధడక్' తోనే ఆడియన్స్ దగ్గర మంచి మార్కులే సాధించింది.కానీ శ్రీదేవి లాంటి లెజెండరీ యాక్ట్రెస్ వారసురాలిగా ఆమె పేరు నిలబెట్టగలదా అనే సందేహం మాత్రం చాలామందికి ఇంకా ఉంది. అయినప్పటికీ జాన్వి మాత్రం ఈ పోలికలు ఏ మాత్రం పట్టించుకోకుండా తన ప్రొఫెషన్ పై పూర్తిగా శ్రద్ధ పెడుతోంది.  జాన్వి ఒక వండర్ఫుల్ డాన్సర్ అనే విషయం చాలామందికి తెలియదు.  ఈ విషయం రీసెంట్ గా ఒక వీడియో ద్వారా అందరికీ తెలిసింది.  ఒక ఈవెంట్లో డ్యాన్స్ చేయడానికి రిహార్సల్ గా జాన్వీ తీవ్రంగా సాధన చేసే వీడియోను ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సంజయ్ శెట్టి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశారు.  దానికి ఆయన ఇచ్చిన క్యాప్షన్ "త్వరలో జరగనున్న ఈవెంట్ కోసం సూపర్ హార్డ్ వర్కింగ్ నటి చేసే రిహార్సల్స్ ఇవి. బిహైండ్ ది సీన్స్."

వీడియోలో ఒక లేడీ కొరియోగ్రాఫర్ తో కలిసి జాన్వి పర్ఫెక్ట్ గా డ్యాన్స్ చేస్తూ ఉంది.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  చాలామంది నెటిజనులు జాన్వి డ్యాన్స్ కు ఇంప్రెస్ అవ్వడమే.. కాదు అమ్మగారు శ్రీదేవిని గుర్తు తెచ్చిందని కితాబిస్తున్నారు.  మీరు ఆ వీడియోపై ఒక లుక్కేయండి.

For Watch Video Click Here