అవతార్ - చేతులెత్తేసిన జేమ్స్ కెమెరున్?

Tue Jul 05 2022 16:04:01 GMT+0530 (IST)

James Cameron About Avatar Series

వెండితెరపై అవతార్ అనే అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించి ప్రేక్షకులను ఎంతగానో కట్టుకున్న జేమ్స్ కెమెరామెన్ ఆ సినిమాకు మళ్ళీ సీక్వెల్స్ ను రూపొందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చి ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఇంకా ఎవరూ కూడా ఆ స్థాయిలో విజువల్ ట్రీట్ అయితే ఇవ్వలేదు. ఇక అలాంటి మ్యాజిక్ ను మరోసారి వెండితెరపైకి తీసుకురావడానికి జీన్స్ కెమెరూన్ ప్రస్తుతం సీక్వెల్ తో చాలా బిజీగా ఉన్నాడు.అసలైతే ఈ ఏడాదిలోనే అవతార్ 2 ది వె ఆఫ్ వాటర్ ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఆ సినిమాను వాయిదా వేసుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. చాలా మంది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసమే ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే సెకండ్ పార్ట్ అనుకున్నప్పుడే దర్శకుడు జేమ్స్ కెమెరూన్ ఆ తర్వాత మరిన్ని భాగాలుగా అవతార్ రానుంది అని తెలియజేశారు.

ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా కొన్ని సిద్ధమయ్యాయి అని కూడా అన్నారు. అయితే ప్రస్తుతం అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే కేవలం మూడవ పార్ట్ వరకే ప్రణాళికలు రచించినట్లుగా తెలుస్తుంది.

జేమ్స్ కెమెరున్ మూడవ పార్ట్ వరకే కొనసాగుతాట. ఇక ఆయన 4 5వ భాగాల వరకు  ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. రీసెంట్గా అయితే జేమ్స్ కెమెరున్ మూడవ పార్ట్ వరకు తాను ప్రాజెక్టును తీసుకు వస్తాను అని అన్నాడు.

ఆ తర్వాత డైరెక్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు అని అన్నారు. ఎందుకంటే ఆ సమయంలో ప్రాజెక్టును హ్యాండిల్ చేయలేకపోవచ్చు అని లేదా మరి ఎవరైనా కూడా లిస్ట్ లోకి చేయవచ్చు అని కూడా ఈ నెంబర్ వన్ దర్శకుడు వివరణ ఇచ్చాడు.

మొత్తానికి జేమ్స్ కెమెరూన్ అయితే అవతత్ రెండు మూడవ భాగాన్ని తానే డైరెక్ట్ చేస్తాను అని చెప్పాడు. ఇక నాలుగో భాగాన్ని అలాగే ఐదవ భాగాన్ని మాత్రం మరొకరు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా సినిమా మార్కెట్ను బట్టి కూడా ఆ సినిమాలు రావచ్చు రాకపోవచ్చు అని హాలీవుడ్ లో ఒక టాక్ అయితే వినిపిస్తోంది.