ఫైటర్ తో రొమాన్స్ కు జాన్వి సైసై

Sun Dec 15 2019 15:32:39 GMT+0530 (IST)

యువహీరో విజయ్ దేవరకొండ త్వరలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. 'ఫైటర్' టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది.  ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలనే ఆలోచనలో పూరి జగన్నాధ్ ఉన్నారట.  ఇప్పటికే హిందీ వెర్షన్ ను ప్రెజెంట్ చేసేందుకు బాలీవుడ్ కరణ్ జోహార్ ముందుకు వచ్చారట.ఇంతే కాదు ఈ సినిమా హీరోయిన్ విషయంలో మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ఒక బాలీవుడ్ హీరోయిన్ ను జోడీగా వెతుకుతున్నారని తెలిసిందే. కరణ్ జోహార్ ఈ సినిమాతో అసోసియేట్ కావడంతో బాలీవుడ్ హీరోయిన్ ఎంపిక సులువయిందట.  ఈ సినిమాలో హీరోయిన్ గా అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్విని ఫైనలైజ్ చేశారట.  సినిమాల విషయంలో జాన్వికి కరణ్ జోహార్ ఒక గాడ్ ఫాదర్ లాంటివారు.  ఎంట్రీ సినిమానే కాకుండా జాన్వి కెరీర్ లో ఎంచుకునే సినిమాల బాధ్యత కూడా కరణ్ స్వయంగా చూస్తున్నారు. దీంతో ఈ సినిమాకు జాన్వి సైన్ చేయడంలో ఆయనే కీలకపాత్ర పోషించారట.

అదొక్కటే కాదు.  జాన్వి గతంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'అర్జున్ రెడ్డి' తర్వాత విజయ్ దేవరకొండకు ఫ్యాన్ గా మారిపోయానని  చెప్పింది. అందుకే ఈ సినిమాకు జాన్వి సైన్ చేసి ఉండొచ్చని అంటున్నారు. త్వరలోనే హీరోయిన్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట.