కరోనాకు థ్యాంక్స్ చెప్పిన జగపతిబాబు..!

Sun Apr 18 2021 22:00:01 GMT+0530 (IST)

Jagapathi babu thanks Corona

కరోనా సెకండ్ వేవ్ దేశంలో రాష్ట్రంలో ఏ స్థాయిలో విజృంభిస్తోందో అందరికీ తెలిసిందే. దేశంలో లక్షల కేసులు.. రాష్ట్రంలో వేలాది కేసులు నమోదవుతున్నాయి. ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ ఎంతో మంది ప్రముఖులు కొవిడ్ బారిన పడ్డారు. పవన్ కల్యాణ్ తోపాటు దిల్ రాజు బండ్ల గణేష్ తదితరులు చాలా మంది చికిత్స పొందుతున్నారు.అయితే.. తాజాగా ఇంట్రస్టింగ్ పోస్టు పెట్టారు సీనియర్ నటుడు జగపతి బాబు. సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా కెరీర్ మొదలు పెట్టిన జగ్గూభాయ్.. సూపర్ సక్సెస్ తో దూసుకెళ్తున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా సినిమా థియేటర్లు షూటింగులపై ఆంక్షలు విధించలేదు. దీంతో.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణ కొనసాగిస్తూనే ఉన్నారు.

అయితే.. ఎవరిలో వైరస్ ఉందో ఎవ్వరూ చెప్పడానికి లేదు. దీంతో.. అందరినీ అనుమానించాల్సిన పరిస్థితి వస్తోంది. అందుకే.. లొకేషన్లో మేకప్ మెన్ ను కూడా దగ్గరికి రానీయట్లేదట జగపతిబాబు. తన మేకప్ తానే వేసుకుంటున్నారట. ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసిన జగపతిబాబు.. కరోనాకు ధన్యావాదాలు తెలిపారు. దానివల్ల.. తనకు తానే మేకప్ మెన్ గా తయారయ్యానంటూ నవ్వేశారు. ‘థాంక్స్ కరోనా.. నాకు నేనే మేకప్ మెన్ గా మారిపోయాను. హా..హా..’ అంటూ ట్వీట్ చేశారు.