బాహుబలి నిర్మాతల 'వెబ్ సిరీస్'లో జగ్గుభాయ్!!

Tue Aug 11 2020 13:20:24 GMT+0530 (IST)

Jagapathi Babu in Bahubali Producers Web Series

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరంటే అది జగపతి బాబు మాత్రమే. హీరోగా వెండితెరకు పరిచయమైన ఆయన ఫ్యామిలీ హీరోగా విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని కలిగి ఉన్నాడు. ఒకప్పుడు హీరోగా లేడీ ఫ్యాన్స్ గుండెల్లో గుడిగంటలు మ్రోగించిన జగపతి బాబు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. హీరో అయినా క్యారెక్టర్ అయినా ఇట్టే మెప్పించగల ఆయన త్వరలోనే మరో వెబ్ సిరీస్ తో మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. కానీ కొత్త జనరేషన్ ఎంటరయ్యాక ఒక దశలో అవకాశాల్లేక ఇబ్బంది పడ్డట్టు స్వయంగా ఆయనే ఇదివరకు వెల్లడించాడు. అయితే లెజెండ్ సినిమాతో విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత జగ్గూ భాయ్ అసలు స్టామినా ఏంటో జనాలకు తెలిసింది.లెజెండ్ తర్వాత విలన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సౌత్‌లో ఫుల్ బిజీ అయిపోయాడు. ఆ తర్వాత వరుసగా రంగస్థలం అరవింద సమేత సినిమాలలో జగపతి బాబు నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇదిలా ఉండగా.. 2018లో ‘గ్యాంగ్‌స్టర్స్’ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి కూడా అడుగుపెట్టిన జగ్గూ భాయ్.. ఇప్పుడు మరో వెబ్ సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. తాజాగా బాహుబలి సినిమా నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ పతాకం పై ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాట. అయితే సెప్టెంబర్ నుంచి ఈ సిరీస్ సెట్స్ మీదకు వెళ్లనుందట. ఈ సిరీస్‌కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ఆ టైంలోనే సిరీస్ కోసం పని చేయబోయే నటీనటులు టెక్నీషియన్స్ గురించి తెలియజేస్తామన్నారట. ఇక జగ్గు భాయ్.. ప్రస్తుతం ఇటు తెలుగులో అటు తమిళంలో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడని సమాచారం.