Begin typing your search above and press return to search.

ట్విట్టర్‌లోనే కాదు.. కాలేజీల్లో కూడా హీరోల ర్యాంక్‌ల గోలలు!

By:  Tupaki Desk   |   20 March 2023 6:02 PM GMT
ట్విట్టర్‌లోనే కాదు.. కాలేజీల్లో కూడా హీరోల ర్యాంక్‌ల గోలలు!
X
హీరో అభిమానుల మధ్య ఉన్న పోరు ఇప్పటిది కాదు. మా హీరో గొప్ప అంటే... మా హీరో గొప్ప అంటూ... తెలుగు సినిమా హీరోలు మాత్రమే కాదు.. ఆయా భాషల హీరోల అభిమానులు కూడా ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు. అయితే అభిమానం వెర్రి తలలు వేస్తున్న పరిణామాలు కూడా ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు ఫ్యానిజం అంటే ఊర్లకే, టౌన్లకు పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కడంతో దాన్ని ఆపే వారే లేకుండా పోతున్నారు.

తాజాగా జేఎన్టీయూ కాకినాడలో ఒక యూత్ ఫెస్టివల్ నిర్వహించారు. అందులో ఫ్యాన్ ఓటింగ్ పేరుతో ఒక ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్లో ఒక్కొక్క ఓటుకి 20 రూపాయలు చెల్లిస్తే ఒక ఓటు కింద లెక్కిస్తూ ఉంటారు. అలా హీరోల అభిమానుల మధ్య మొదలైన ఈ ఓటింగ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నట సింహం నందమూరి బాలకృష్ణ మధ్య ఓటింగ్ పెట్టారు.

ఇక పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 398 ఓట్లు పవన్ కళ్యాణ్ దక్కించుకుంటే... ఎన్టీఆర్ మాత్రం 458 ఓట్లు దక్కించుకో గలిగారు. అంటే ఎన్టీఆర్ అభిమానులు తమ దగ్గర ఉన్న డబ్బులు పోగేసి ఈ ఫెస్టివల్‌కి సంబంధించి ఓటింగ్ కోసం డబ్బులు వెచ్చించి మరీ కొనుగోలు చేశారని తెలుస్తోంది. దీంతో చివరికి జూనియర్ ఎన్టీఆర్ గెలిచినట్లుగా ప్రకటించారు నిర్వాహకులు.

నిజానికి ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలవాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో వెళ్లి 500 రూపాయల పెట్టి ఎన్టీఆర్ కోరకు టికెట్లు కొన్నారట. అలా పవన్ కళ్యాణ్ గెలవాల్సిన చోట ఎన్టీఆర్ గెలిచినట్లయింది. ఈ విషయాన్ని ఒక ఎన్టీఆర్ అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో బయటకు వచ్చింది. ఎక్కడైనా సరే జూనియర్ ఎన్టీఆర్ కోసం తగ్గేదే లేదు అన్నట్లుగా సదరు అభిమాని కామెంట్ చేశారు. దీనితో ఈ విషయం ఆసక్తి కరంగా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వ్యవహారం మీద మీరు కూడా ఒకసారి కన్నేసేయండి మరి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.