సుధీర్ బాబు రిలీజ్ చేసిన హిమజ హారర్ థ్రిల్లర్ ''జ'' ట్రైలర్..!

Tue Jul 20 2021 16:50:11 GMT+0530 (IST)

JA trailer released by Sudhir Babu

'బిగ్ బాస్' తెలుగు సీజన్-3 రియాలిటీ షో తో పాపులారిటీ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ హిమజ.. ఇంతముందు 'ఉన్నది ఒకటే జిందగీ' 'నేను శైలజ' 'నెక్స్ట్ నువ్వే' 'ధృవ' 'మహానుభావుడు' 'స్పైడర్' వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించింది. తన అందంతోనే కాదు అభినయంతోనూ ప్రేక్షకులను అలరించిన హిమజ.. ప్రస్తుతం బుల్లి తెర షోస్ - టీవీ సీరియళ్లు సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో ''జ'' అనే హారర్ థ్రిల్లర్ లో ప్రధాన పాత్ర పోషిస్తోంది హిమజ. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ - సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను హీరో సుధీర్ బాబు లాంచ్ చేసి చిత్ర యూనిట్ కి విషెస్ అందజేశారు.''జ'' ట్రైలర్ లో ఓ హాంటెడ్ హౌస్ చూపిస్తూ.. ఆ ఇంట్లో ఉంటున్న హిమజ ను ఏదో అదృశ్య శక్తి వెంటాడుతున్నట్లు చూపించారు. భయాన్ని కలిగించడానికి అన్ని హారర్ సినిమాలో ఉండే ఎలిమెంట్స్ ని ఇందులోనూ చూపించే ప్రయత్నం చేశారు. వింతగా బిహేవ్ చేస్తున్న హిమజ ను తన భర్త.. డాక్టర్ వద్దకు తీసుకొనిపోగా.. ఇంట్లో ఏదో ఉన్నట్లు చెబుతుంది. మరి ఆ ఇంట్లో ఉన్న అదృశ్య శక్తి ఏంటి? హిమజ ను ఎందుకు వెంబడిస్తోంది? దీని వెనకున్న అసలు కథ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సింది

'జ' చిత్రంలో ప్రతాప్ రాజ్ - 'జబర్దస్త్' సుడిగాలి సుధీర్ - గెటప్ శ్రీను - ఫణి లతో పాటుగా ప్రీతి నిగమ్ - ఛత్రపతి శేఖర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సైది రెడ్డి చిట్టెపు దర్శకత్వం వహించారు. జైదుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై గోవర్ధన్ రెడ్డి కందుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేంగి సంగీతం సమకూర్చగా.. శివ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఆనంద్ పవన్ ఎడిటింగ్ వర్క్ చేశారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. హిమజ తొలిసారి లీడ్ రోల్ చేస్తున్న ఈ హారర్ చిత్రం 'జ'.. ఎలాంటి ఆదరణ దక్కించుకుంటదో చూడాలి.