ఫొటోటాక్ : మేకప్ లేకుండా గుర్తు పట్టడం కష్టం

Wed Jul 28 2021 11:00:01 GMT+0530 (IST)

Its hard to remember without makeup

టాలీవుడ్ ప్రేక్షకులు ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేవదాసు సినిమాతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన ముద్దుగుమ్మ ఇలియానా టాలీవుడ్ లో మొదటి కోటి పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా నిలిచింది. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దూసుకు పోతున్న సమయంలో బాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చి అటుగా వెళ్లింది. అక్కడ కొన్నాళ్ల పాటు బిజీగా ఉన్నా ఆ తర్వాత ఆమెకు ఆఫర్లు తగ్గాయి. అయినా కూడా అక్కడ ఇక్కడ అంటూ ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.టాలీవుడ్ లో సుదీర్ఘ కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా లుక్ పై కొందరు బ్యాడ్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్ జీరో సైజ్ హీరోయిన్ అంటే వెంటనే ఇలియానా గుర్తుకు వచ్చే వారు. కాని ఇప్పుడు ఏంటీ ఇలా తయారు అయ్యింది అంటూ కామెంట్స్ రావడంతో ఇలియానా మళ్లీ తగ్గింది. ఆమె బరువు తగ్గడంతో పాటు మునుపట రూపంకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతం గతంలో మాదిరిగా జీరో సైజ్ కు వచ్చిందని ఈ ఫొటోను చూస్తుంటే అర్థం అవుతుంది.

ఈ ఫొటోలో ఇలియానాను చూడగానే గుర్తించడం కాస్త కష్టంగానే ఉంది. ఎందుకంటే మేకప్ లేకపోవడంతో కెమెరా టాప్ యాంగిల్ ఉండటం వల్ల వెంటనే గుర్తించలేకుండా ఉన్నామని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోతో ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. నో మేకప్.. నో ఫిల్టర్స్.. నాచురల్ ఫొటో అంటూ ఇలియానా ఈ ఫొటోను షేర్ చేసింది. ఇలియానా షేర్ చేసిన ఈ ఫొటో కొందరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

ఇలియానా మరీ ఇలా ఉంటుందా మేకప్ లేకుంటే అంటూ మీమ్స్ చేస్తున్నారు. మొత్తానికి ఇలియానా తన నాచులర్ లుక్ ను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ చిన్నా చితకా సినిమాల్లో నటిస్తోంది. తెలుగు లో కూడా ఒక సినిమాను కమిట్ అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంకా ఆ విషయమై క్లారిటీ రాలేదు.