ఆమె వలలో చిక్కితే మట్టగిడసలా గిజగిజే

Wed Nov 30 2022 05:00:01 GMT+0530 (India Standard Time)

Its difficult to look away from Malaika Arora

50 ఏజ్ నథింగ్ మ్యాటర్!! ఏజ్ తో పనే లేకుండా అందంతో కవ్విస్తున్న మలైకా అరోరాఖాన్ ఎప్పటికీ బాలీవుడ్ లో ట్రెండీ టాపిక్. స్టైల్ కంటెంట్ లో మలైకా రేంజే వేరని నిరూపణ అయ్యింది. ఆల్ టైమ్ హాటెస్ట్ ఫోటోషూట్లతో అంతర్జాలంలో దుమారం రేపడం ఈ భామ స్టైల్. తాజాగా ఈ బ్యూటీ మరో హాటెస్ట్ లుక్  దుమారం రేపుతోంది. థై స్లిట్ షీర్ నెట్ డ్రెస్ లో మలైకా షోస్టాపర్ గా నిలిచింది. 50 వయసురే చేరువ అవుతున్నా.. దాంతో పని లేకుండా టైట్ హగ్  డిజైనర్ ఇన్నర్ కి థై స్లిట్ ఎలివేషన్ క్రాక్ పుట్టించిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మలైకా ప్రస్తుత ఏజ్ 48. హాఫ్ సెంచరీకి చేరువైంది. అయినా ఇంకా వయసు ఒక నంబర్ మాత్రమే.వేడెక్కించేందుకు కవ్వించేందుకు వయసుతో పని లేదని నిరూపిస్తోంది. తనకంటే చాలా చిన్న వయసు చాక్లెట్ బోయ్ అర్జున్ కపూర్ తో  డేటింగ్ చేస్తున్న ఈ బ్యూటీకి ప్రతిసారీ మీడియాలో పెళ్లెప్పుడు ?  అనే ప్రశ్న ఎదురవుతోంది. కానీ  సమాధానం లేదు. ఇలా సంతోషంగా ఉన్నాం అది చాలు! అని చెబుతున్నారు. పెళ్లి కంటే మలైకా దృష్టి సంపాదనపైనా ఆనందకర జీవితంపైనే అనడంలో సందేహం లేదు. మలైకా ఇటీవల ఫ్యాషన్ ఈవెంట్లు -బుల్లితెర కార్యక్రమాలతో అసాధారణంగా ఆర్జిస్తోంది. యోగా గురువుగానూ యూట్యూబ్ లో భారీ ఆదాయ ఆర్జనను కలిగి ఉంది.

తాజాగా షీర్ నెట్ డ్రెస్ సందర్భం ఏమిటో వెతికితే ఆసక్తికర విషయం తెలిసింది. యాక్షన్ హీరో సినిమాలోని “ఆప్ జెసా కోయి” పాటలో హనా పచ్చటి షీర్ డ్రెస్ లో హీటెక్కించబోతోంది. హనా రాక్ల నుండి అపారదర్శక మెష్ ఓవర్ లేతో అలంకరించిన మెరిసే ఆకుపచ్చ-బంగారు దుస్తులను మలైకా ధరించింది.


బి-టౌన్కి వచ్చినప్పటి నుండి మలైకా అరోరా చిత్ర పరిశ్రమలో అద్భుత నృత్య కదలికలతో అలరించింది. 49 ఏళ్ల మలైకాకు వయస్సు పట్టింపు లేదు. వయస్సుతో పాటు ఆమె అందం పెరుగుతోందే కానీ తరగడం లేదు.. మలైకా తన కెరీర్ను VJ గా ప్రారంభించింది. సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత వెనుదిరిగి చూడలేదు. కొన్ని అద్భుతమైన హుక్ స్టెప్పులతో ఐటమ్ క్వీన్ గా మరిపించింది. మత్తెక్కించే కదలికలు హాటెస్ట్ లుక్స్ వ్యక్తీకరణలతో భారీగా ప్రేక్షకుల హృదయాలను దొంగిలించింది.

సల్మాన్ దబాంగ్ లో మున్నీ బద్నామ్ హుయ్ సాంగ్ ఇప్పటికీ మలైకా కెరీర్ బెస్ట్ గా నిలిచింది. ఈ ఒక్క పాట చాలు.. మలైక ఎంత ఆకర్షణ కలిగిన ప్రతిభావంతురాలు నేది గుర్తించేందుకు.. మలైకా గత ఐదేళ్లుగా చాలావరకూ పెద్దతెరకు దూరమైంది.  కానీ ఆమె ఎట్టకేలకు ఘనంగా పునరాగమనం చేస్తోంది. యాక్షన్ హీరో సినిమాలోని “ఆప్ జేసా కోయి” పాటలో అదరగొట్టబోతోంది.

తదుపరి చిత్రం యాన్ యాక్షన్ హీరో లో నటుడు ఆయుష్మాన్ ఖురానా నిజ జీవితంలో ప్రాణాంతక పరిస్థితులను ఎదుర్కొనే యాక్షన్ సినిమా స్టార్ గా నటించనున్నారు. ఈ సినిమా సౌండ్ ట్రాక్ లోని రెండో పాట పబ్లిక్గా విడుదలైంది. ఆప్ జైసా కోయి అనే పాటలో మలైకా అరోరా 1980 నాటి పాపులర్ బల్లాడ్ వెర్షన్ కి డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. యాన్ యాక్షన్ హీరోలోని 'ఆప్ జైసా కోయి' పాట వీడియోలో మలైకా చాలా హాట్ గా కనిపించనుంది. ఇందులో హనా రాక్ ల నుండి పారదర్శక మెష్ ఓవర్ లేతో అలంకరించిన మెరుపుల ఆకుపచ్చ-బంగారు దుస్తులను ధరించింది. స్ట్రాప్ లెస్ డ్రెస్ లో ఫిగర్-హగ్గింగ్ సిల్హౌట్.. కార్సెట్డ్ బాడీస్ సీ-త్రూ స్కర్ట్ .. థై స్ప్లిట్ ఎలివేషన్ ఆకట్టుకుంటున్నాయి. బ్రాకెట్ లుక్ ఆభరణంతో అందమైన నెక్లైన్ ను ఆవిష్కరించింది. సొగసైన డిజైన్లో బ్రాస్ లెట్.. స్ట్రైకింగ్ రింగ్లు .. గోల్డ్ స్ట్రెప్డ్ హీల్స్తో లుక్ ను యాక్సెసరైజ్ చేసింది.  స్మోకీ ఐ మేకప్ మిరుమిట్లు గొలిపే హైలైటర్ - మాస్కరా-కోటెడ్ లాషెస్ తో మైండ్ బ్లాక్ చేసింది.

మలైకా అరోరా ఉత్తరాది దక్షిణాది పరిశ్రమల్లో పాపులర్ ఐటెమ్ నంబర్లలో నర్తించింది. ప్రతిసారీ పాత రూపానికి భిన్నంగా కనిపించడం తనకు మాత్రమే చెల్లింది. ఆమె షారుఖ్ ఖాన్ తో కలిసి పాపులర్ నంబర్ చయ్యా చయ్యాలో అద్భుత నృత్యంతో అలరించింది. మున్నీ బద్నామ్ హుయ్- అనార్కలీ డిస్కో చలీ- కాల్ ధమాల్ పాపులర్ డ్యాన్స్ నంబర్లలో కొన్ని.
యాక్షన్ హీరో సినిమాలోని “ఆప్ జెసా కోయి” పాటలో మలైకా అరోరా అందచందాలు అగ్గి రాజేయడం ఖాయమని ఈ ఫోటోలు చెబుతున్నాయి. ఈ లుక్ కి స్టైలిస్ట్: మేనకా హరిసింఘాని.. మేకప్: మేఘా బుటాని.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.