Begin typing your search above and press return to search.

ఆదిపురుష్ అప్డేట్‌కు ముహూర్తం కుదిరింది

By:  Tupaki Desk   |   20 March 2023 2:00 PM GMT
ఆదిపురుష్ అప్డేట్‌కు ముహూర్తం కుదిరింది
X
బాహుబలి సిరీస్‌ తో పాన్ ఇండియా హీరోగా ఎస్టాబ్లిష్ అయిన ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవెల్‌ లోనే రిలీజ్ అవుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు దారుణమైన డిజాస్టర్లుగా నిలిచిన నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న దాదాపు అన్ని సినిమాల మీద ప్రభాస్ ప్రత్యేక దృష్టి సారించాడు.

అయితే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురష్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు తెరమీదకు వచ్చింది. ప్రభాస్ హీరోగా నటించిన మైథాలజికల్ ఎంటర్టైనర్ ఆదిపురుష్ జూన్ 16, 2023న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో థియేటర్లలో విడుదల కాబోతోంది. ప్రభాస్ రఘు రాముడు పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నాడు.

ఇక హనుమంతుడి పాత్రలో దేవదత్తా నాగే నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా త్రీడి ఇమేజింగ్ కోసం వాయిదా పడిందని ఒక ప్రచారం అయితే ఉంది. కానీ చాలా వారాలుగా ఈ సినిమా గురించిన ఒక సాలిడ్ అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు, తాజా సమాచారం ఏమిటంటే, మార్చి 30, 2023న వచ్చే రామనవమి సందర్భంగా మేకర్స్ ఒక అప్‌డేట్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడాల్సి ఉంది.

ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాలో రావణాసుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఆయనది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రగా తెలుస్తోంది. టీ సిరీస్ సహా రెట్రోఫిల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని 3డీ ఫార్మాట్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమా మోషన్ గ్రాఫిక్స్ ఆధారంగా రూపొందించారు. గతంలో ఒక టీజర్ విడుదల చేయగా... ఆ టీజర్ మీద పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిసింది. సోషల్ మీడియాలో ఆ టీజర్‌పై ట్రోల్స్ పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ తర్వాత దాన్నే త్రీడీ వర్షన్‌లో చూపిస్తే అద్భుతం అంటూ కొనియాడారు. ఈ నేపథ్యంలో ఆది పురుష్ సినిమాను 3డీ లోనే పెద్ద ఎత్తున విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.