Begin typing your search above and press return to search.

పవన్ ఫ్యాన్స్ కోసం 'వకీల్ సాబ్' లో భారీ మార్పులే చేసినట్లున్నారే..!

By:  Tupaki Desk   |   15 Jan 2021 9:30 AM GMT
పవన్ ఫ్యాన్స్ కోసం వకీల్ సాబ్ లో భారీ మార్పులే చేసినట్లున్నారే..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా వస్తున్న 'వకీల్ సాబ్' కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారి అంచనాలను రెట్టింపు చేసేలా సంక్రాంతి సందర్భంగా గురువారం ఈ చిత్ర టీజర్ ని రిలీజ్ చేశారు. హిందీ హిట్ మూవీ 'పింక్‌' కి రీమేక్‌ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో భారీ మార్పులే చేసినట్లు టీజర్ చూస్తే అర్థం అవుతోంది. నిజానికి ఒరిజినల్ వెర్షన్ లో అమితాబ్ పోషించిన పాత్రను పవన్ ప్లే చేస్తున్నట్లు తెలిసినప్పుడు అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఎందుకంటే ఈ చిత్రంలో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో హిందీ, తమిళ వెర్షన్లు చూసిన వాళ్లకు తెలుస్తుంది. అందుకే పవర్ స్టార్ రీ ఎంట్రీ మూవీపై చాలామంది పెదవి విరిచారు. అయితే టీజర్ చూసిన తర్వాత వారికి 'వకీల్ సాబ్' పై ఓ ఐడియా వచ్చేసింది.

'వకీల్ సాబ్' టీజర్ చూస్తుంటే హిందీ తమిళ వర్సన్స్ తో సంబంధం లేకుండా యాక్షన్ కి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. మాతృకలో లేని కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ పవర్ స్టార్ కోసం ప్రత్యేకంగా క్రియేట్ చేశారనే విషయం అర్థమైపోతుంది. దర్శకుడు వేణు శ్రీరామ్ ఇందులో హీరోది లాయర్ పాత్ర అయినప్పటికీ ఫ్యాన్స్ కోసం ఈ సినిమాలో చాలానే మార్పులు చేసినట్లు కనిపిస్తోంది. అలానే శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకుని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని కూడా పెడుతున్నారు. మొత్తం మీద ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుని కథ కథనంలో చేంజెస్ చేసారని చెప్పవచ్చు.

కాగా, బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్ రాజు - శిరీష్ కలిసి నిర్మించారు. ఈ చిత్రంలో నివేధా థామస్ - అంజలి - అనన్య - ప్రకాష్ రాజ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు 'వకీల్ సాబ్' ద్వారా అయినా విడుదల తేదీని ప్రకటిస్తారని ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేశారు. కానీ ఈ విషయంలో వారికి నిరాశే ఎదురైంది.