పూరి హీరో మూడేళ్ల తర్వాత వస్తున్నాడు

Thu Nov 26 2020 14:40:54 GMT+0530 (IST)

Puri Hero is coming after three years

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కన్నడం మరియు తెలుగులో రూపొందిన రోగ్ సినిమా గుర్తుందా.. 2017లో వచ్చిన ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. బెంగళూరుకు చెందిన ఇషాన్ ఆ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమా దారుణంగా ప్లాప్ అవ్వడంతో ఇషాన్ గ్యాప్ తీసుకున్నాడు. పూరిపై పెట్టుకున్న నమ్మకం వమ్ము అవ్వడంతో రెండవ సినిమా విషయంలో ఇషాన్ ఆచితూచి అడుగులు వేశాడు. మూడేళ్ల గ్యాప్ తర్వాత ఎట్టకేలకు ఇషాన్ తన రెండవ సినిమాను అధికారికంగా ప్రకటించాడు.ఇషాన్ రెండవ సినిమాకు పవన్ వడేయార్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా కూడా కన్నడంతో పాటు తెలుగులో కూడా తెరకెక్కబోతుంది. ద్వి భాష చిత్రంగా రూపొందబోతున్నబోతున్న ఈ సినిమాకు రైమో అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇషాన్ ఫస్ట్ లుక్ ను కూడా అధికారికంగా విడుదల చేశారు. ఈ సినిమాను ఇషాన్ తండ్రి సీఆర్ మనోహర్ నిర్మించబోతున్నాడు. రెండవ సినిమాతో అయినా సక్సెస్ ను దక్కించుకునే ఉద్దేశ్యంతో ఇషాన్ కాస్త ఆలస్యం అయినా మంచి కథ కోసం వెయిట్ చేశాడు. మరి రైమో సినిమా ఇషాన్ కు సక్సెస్ ను ఇచ్చేనా చూడాలి.