Begin typing your search above and press return to search.

జ‌క్క‌న్న చెప్పిన రోమాంచిత సీన్ ఇదేనా?

By:  Tupaki Desk   |   22 May 2022 1:30 AM GMT
జ‌క్క‌న్న చెప్పిన రోమాంచిత సీన్ ఇదేనా?
X
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ట్రిపుల్ ఆర్‌` ఇటీవ‌ల విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. దాదాపు నాలుగేళ్ల విరామం త‌రువాత ఈ మూవీ అనేక అవాంత‌రాల‌ని దాటి మొత్తానికి ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కోసం యావ‌త్ దేశ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు ఆస‌క్తిగా ఎదురుచూశారు. ఇద్దు స్టార్ హీరోలు మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి న‌టించిన సినిమా కావ‌డంతో ఈ ఇద్ద‌రిని వెండితెరై చూడాల‌ని భాష‌తో సంబంధం లేకుండా అంతా ఎదురుచూశారు.

భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించింది. 1100 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పింది. రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర‌లోనూ, ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర‌లోనూ న‌టించి త‌మ త‌మ పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు. ఈ ఇద్ద‌రి న‌ట‌న‌పై ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం సినిమాలో త‌మ హీరో పాత్ర‌కు ప్రాముఖ్య‌త త‌గ్గిందంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ చేశారు. రాజ‌మౌళిపై ఓ రేంజ్ లో విరుచుకుప‌డుతూ విమ‌ర్శ‌ల‌కు దిగారు. కానీ రాజ‌మౌళి మాత్రం సినిమా ప్రారంభం నుంచి ఇద్ద‌రు హీరోల‌కు సినిమాలో స‌మాన ప్రాధాన్య‌త వుంటుంద‌ని చెబుతూ వ‌చ్చారు, అయితే ఓ సీన్ గురించి టీజ‌ర్‌, ట్రైల‌ర్ టైమ్ లోనే హింట్ ఇచ్చారు.

సినామ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ప‌లు మీడియాల‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల్లోనూ ఇదే విష‌యాన్ని వెల్ల‌డించారు. ప్రీ ఇంట‌ర్వెల్ కు ముందు వ‌చ్చే స‌న్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా వుంటుంద‌ని ముందే చెప్పేశారు. సినిమా చూసిన త‌రువాత ఆ సీన్ ఏంట‌న్న‌ది అంద‌రికి స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. స్కాట్ బంగ్లాలో జ‌రిగే పార్టీ స‌మయంలో భారీ వ్య‌న్ లో అడ‌వి మృగాల‌తో క‌లిసి ఎన్టీఆర్ దాడి చేసే సీన్ సినిమాకు ప్ర‌ధాన హైలైట్ గా నిల‌చింది.

ఈ సీన్ లో ఎన్టీఆర్ ని చూపించిన తీరు, వ్యాన్ లోంచి అడ‌వి మృగాల‌తో క‌లిసి త‌నూ ఓ బీస్ట్ గా విరుచుకుప‌డిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ అబ్బుర ప‌రిచింది. ఎన్టీఆర్ సీరియ‌స్ సీన్ చేస్తే ఎలా వుంటుందో మ‌రో సారి ఈ స‌న్నివేశంతో జ‌క్క‌న్న నిరూపించి త‌ను సినిమా రిలీజ్ కు ముందు చెబుతూ వ‌చ్చిన సీన్ ఇదే అంటూ అంద‌రికి క్లారిటీ ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ లో జ‌క్క‌న్న దీనితో పాటు మ‌రో సీన్ గురించి కూడా వివ‌రించారు.

అది ఎన్టీఆర్ ని చ‌ర‌ణ్ ద‌డించే కొమురం భీముడో సాంగ్ వ‌చ్చే స‌న్నివేశం. ఈ సీన్ లో ఎన్టీఆర్ ప‌లికించిన హావ భావాలు స్పీచ్ లెస్ అని స్ప‌ష్టం చేసి ఎన్టీఆర్ కు ఈ మూవీలో ఇచ్చిన ప్రాధాన్య‌త‌ని చెప్ప‌క‌నే చెప్పడం విశేషం. ఈ రెండు స‌న్నివేశాలు ట్రిపుల్ ఆర్ కు ఆయువు ప‌ట్టుగా నిలిచిన విష‌యం తెలిసిందే.