సమంత బిగ్ బాస్ అవ్వడానికి కారణం ఇదేనా?

Sun Oct 25 2020 18:00:14 GMT+0530 (IST)

Is this the reason why Samantha became the Big Boss?

గత రెండు మూడు వారాలుగా జరుగుతున్న ప్రచారం ఈ వారం నిజం అయ్యింది. నాగార్జున షూటింగ్ కోసం వెళ్లగా ఈ వారం గెస్ట్ హోస్ట్ రాబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. గడచిన రెండు మూడు వారాలు ఆ వార్తలు నిజం కాదని నాగార్జున వచ్చి చెప్పకనే చెప్పాడు. కాని ఈ వారం మాత్రం నిజంగానే నాగార్జున షూటింగ్ కోసం వెళ్లాడు. వైల్డ్ డాగ్ కోసం తాను మనాలీలో ఉన్నట్లుగా నాగార్జున స్వయంగా వీడియో విడుదల చేసి చెప్పడంతో ఈసారి గెస్ట్ హోస్ట్ ఖాయం అనుకున్నారు. అన్నట్లుగానే సమంత గెస్ట్ హోస్ట్ గా వచ్చేసింది. నేడు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం కాబోతున్న ఈ షో కు మంచి రేటింగ్ వస్తుందనే నమ్మకంను స్టార్ మా వ్యక్తం చేస్తోంది.గత సీజన్ లో రమ్యకృష్ణ హోస్ట్ గా చేసింది. ఈ సీజన్ లో రేటింగ్ విషయంలో ఇప్పటికే స్టార్ మా నిరాశగా ఉంది. ఇలాంటి సమయంలో నాగార్జున ఎపిసోడ్ మిస్ చేస్తే రేటింగ్ మరింతగా పడిపోతుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. దాన్ని బ్యాలన్స్ చేసేందుకు గాను దసరా సందర్బంగా ప్రత్యేకంగా షో ఉండేందుకు గాను సమంతను తీసుకు వచ్చే నిర్ణయాన్ని స్వయంగా నాగార్జున తీసుకున్నాడట. ప్రత్యేకంగా సమంతకు భారీ పారితోషికం ఏమీ లేకుండా నాగార్జున ఆమెను ఒప్పించాడట. తనకు ఇచ్చే పారితోషికంలో భాగంగానే ఆమెను తీసుకు వచ్చారు.

దసరా ప్రత్యేక ఎపిసోడ్ ను సమంతతో చేయించడం వల్ల రెండు విధాలుగా కలిసి వస్తుందనే నమ్మకంను షో నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు. 50వ ఎపిసోడ్ మరియు దసరా ఒక్క రోజే అవ్కడం మరియు సమంత రావడం వంటి కారణాలతో రెగ్యులర్ గా కంటే మంచి రేటింగ్ నేడు ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ కు వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. సమంత కాకుండా మరెవ్వరైనా కూడా బిగ్ బాస్ షో కు ఇంత హైప్ రాకపోవచ్చు. అందుకే సమంతను ఎంపిక చేశారు అనేది అందరి మాట.