Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి పెద్ద సమస్య వచ్చిపడిందే..?

By:  Tupaki Desk   |   22 Feb 2021 12:46 PM GMT
ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి పెద్ద సమస్య వచ్చిపడిందే..?
X
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్ లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో సహా 8 భారతీయ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. చరిత్రలో కలవని అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ పాత్రలను తీసుకుని ఫిక్షనల్ కథతో ఈ పీరియాడికల్ మూవీని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. అయితే ఇప్పుడు 'ఆర్.ఆర్ ఆర్' చిత్రానికి ఓ పెద్ద స‌మ‌స్య వ‌చ్చి ప‌డిందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇప్పటికే రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌డంతో 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ ఓ వైపున మిగతా సినిమా షూటింగ్ జ‌రుపుకుంటూనే, మ‌రోవైపున పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వర్క్ మరియు గ్రాఫిక్స్ వ‌ర్క్స్ చేయిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి విజువ‌ల్ ఎఫెక్ట్స్ త‌దిత‌ర డిపార్ట్మెంట్స్ లో వ‌ర్క్ చేయ‌డానికి నిపుణుల స‌మస్య వ‌స్తోంద‌ని టాక్ వినిపిస్తోంది. గ్రాఫిక్స్ వర్క్ డిపార్ట్మెంట్ లో చాలా మంది టెక్నీషియ‌న్లు విదేశీయులు అవ్వ‌డంతో ఇప్పుడు వారి కొర‌త ఎక్కువైందట. ఆన్ లైన్ లో వ‌ర్క్ చేద్దామంటే కంటెంట్ లీక్ అయ్యే స‌మ‌స్యలు ఉండ‌టంతో అందుబాటులో ఉన్న టెక్నిషియ‌న్లతోనే వ‌ర్క్ చేయిస్తున్నారట. దీంతో ట్రిపుల్ ఆర్ పనులు న‌త్త‌న‌డ‌క‌న సాగుతున్నాయని అనుకుంటున్నారు. ఇందులో నిజమెంతనేది పక్కన పెడితే 'ఆర్.ఆర్.ఆర్' సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు.