సుఖేష్ చంద్రశేఖర్- అతని భార్య లీనా మరియా పాల్ సంచలన స్కామ్ గురించి తెలిసినదే. ఈ తమిళ జంట ప్రముఖ వ్యాపార వేత్తను 200కోట్ల మనీలాండరింగ్ కేసులో మోసం చేయడం సంచలనమైంది. ఈ కేసులో బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ పెర్నాండేజ్- నోరా పతేహి ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. సుఖేష్ చంద్రశేఖర్ తో ఈ భామలిద్దరు సంబంధాలు నెరిపిన నేపథ్యంలో ఈ కేసులో ఆ ఇద్దరు కీలకంగా మారారని కథనాలొచ్చాయి. మనీలాండరింగ్ కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తును ప్రారంభించింది. ఇప్పటికే ఈడీ విచారణకు నాలుగు సార్లు డుమ్మా కొట్టిన జాక్వెలిన్ చివరికి బుధవారం విచారణకు హాజరు కాక తప్పలేదు. 200 కోట్ల కుంభకోణంలో జాక్వెలిన్ ని ఈడీ ప్రశ్నించింది.
సుఖేష్ చంద్రతో
తనకున్న రిలేషన్ షిప్.. ఇద్దరి మధ్య జరిగిన ఆర్ధిక లావాదేవీల గురించి
ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికే నోరా ఫతేహీ నుంచి ఈడీ అధికారులు
కీలక సమాచారం రాబట్టడంతో జాక్వెలీన్ వ్యవహారంపైనా ఉచ్చు
బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. పైగా నాలుగుసార్లు అనారోగ్యం ఒత్తిడి
కారణంగా హాజరు కాకుండా ఈడీ విచారణను నుంచి తప్పించుకున్న జాక్వెలిన్
వ్యవహారపై అనుమానులు మరింత బలపడుతున్నాయి. ఇటీవల జరిగిన
విచారణలో జాక్వెలీన్ ని లోతుగా ప్రశ్నించి కీలక విషయాలు
రాబట్టినట్లు సమాచారం. నాలుగు సార్లు హాజరు కాకపోవడానికి బలమైన
కారణాలు కూడా చూపించాలని ఈడీ కోరిందట.
ఆ సమయంలో జాక్వెలీన్
సరైన ఆధారాలు కూడా చూపించలేకపోయిందని మీడియా కథనాలు
వేడెక్కిస్తున్నాయి. మరి ఈ కేసులో దోషులుగా తేలితే గనుక జాక్వెలీన్ కి
జైలు శిక్ష తప్పదని తెలుస్తోంది. ఈ కేసు పై పోలీసులు..ఈడీ ఐదేళ్లుగా
విచారిస్తున్నారు. ఇప్పటికే సుఖేష్ చంద్ర- లీనా మరియా పాల్ ని అరెస్ట్
అయి బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే జాక్వెలీన్
ఫెర్నాండేజ్ నటించిన `భూథ్ పోలీస్` రిలీజ్ అయింది. అలాగే జాక్వెలిన్
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. సర్కస్- రామ్ సేతు-బచ్చన్ పాండే
-ఎటాక్- కిక్ 2 వంటి చిత్రాలు క్యూలో ఉన్నాయి. ఇంకా చాలా ప్రాజెక్ట్ లు
ప్రకటించాల్సి ఉంది. టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరిహర
వీరమల్లులోనూ ఓ పాత్రలో నటిస్తోంది. మరి తాజాగా పడిన మరక
జాక్వెలీన్ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనన్న గుబులు పరిశ్రమ
వర్గాల్లో ఉంది.
సౌత్ లోనూ క్రేజు పెంచుకుంటున్న తరుణంలో..!
బ్యాడ్
బోయ్ అంటూ సాహో ప్రభాస్ సరసన ఆడిపాడిన శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్
తెలుగు వారికి సుపరిచితమే. పరిశ్రమలో హాటెస్ట్ బ్యూటీగా పాపులర్. జాకీ
సూపర్ హాట్ గ్లామరస్ లుక్స్ అద్భుతమైన వ్యక్తిత్వంతో తన అభిమానుల
దృష్టిని ఎలా తనవైపు తిప్పేసుకోవాలో తెలిసిన భామ. జాక్విలిన్ తాజాగా ఇన్
స్టా వేదికగా షేర్ చేసే ఫోటోలు వీడియోలకు సౌత్ లోనూ విపరీతమైన
ఫాలోయింగ్ ఏర్పడింది.
జాక్విలిన్ ఇటీవల అద్భుత నటనా నైపుణ్యంతో
అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రీలంకన్ బ్యూటీకి యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది.
అక్కడ తన షూట్ లైఫ్ ఆన్-సెట్ మస్తీ నుండి BTS వీడియోలను క్రమం తప్పకుండా
పోస్ట్ చేస్తుంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ తన
అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకే ఏదో ప్రతిసారీ
కొత్తదనాన్ని ప్రయత్నిస్తోంది. కెరీర్ ఊపందుకుంటున్న దశలో తనపై
పడిన మనీల్యాండరింగ్ స్కామ్ మరకలు ఇబ్బందికర సన్నివేశాన్ని
తెచ్చాయి.
ఫ్యాషనిస్టాగా మెరుపులు మెరిపిస్తుంది. అది బ్యాక్ లెస్
స్నాప్ లు లేదా అందమైన రెడ్ కార్పెట్ లుక్స్.. ఇంకేదైనా ఆమె ఫ్యాషన్ గేమ్
ఎల్లప్పుడూ పాయింట్ బ్లాక్ లో ఉంటుంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒక అందమైన
మిరమిర మెరుపుల డిజైనర్ సెట్ .. బ్లాక్ బ్రాలెట్ లో కొత్త ఫోటోషూట్ ని
సోషల్ మీడియాలో షేర్ చేసింది