సూపర్ స్టార్ మరోసారి ఆ దర్శకుడిని నమ్మబోతున్నాడా?

Mon Jun 14 2021 11:27:33 GMT+0530 (IST)

Is the superstar going to trust that director once again?

తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా వచ్చిన 'మాస్టర్' సినిమా మిశ్రమ స్పందన దక్కించుకుంది. తెలుగులో డబ్ అయిన మాస్టర్ ను ఇక్కడి వారు పెద్దగా పట్టించుకోలేదు. కాని తమిళ ఆడియన్స్ మాత్రం మాస్టర్ కు బ్రహ్మరథం పట్టారు. మాస్టర్ సోలో రిలీజ్ ఛాన్స్ దక్కించుకున్న కారణంగా భారీ వసూళ్లను దక్కించుకుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళ క్రిటిక్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. విజయ్ ను ఆయన అభిమానులు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలాగే చూపించాడు.అభిమానులను పూర్తి స్థాయి సంతృప్తి పర్చిన లోకేష్ కనగరాజ్ పై విజయ్ చాలా నమ్మకంతో ఉన్నాడు. మరోసారి కూడా ఆయనతో సినిమాను చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ తో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభం అయినా కరోనా కారణంగా ఆలస్యం అవుతోంది. కమల్ మూవీ తర్వాత మళ్లీ విజయ్ తోనే లోకేష్ మూవీ ఉండే అవకాశం ఉందంటున్నారు.

విజయ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా మాత్రమే కాకుండా రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో ఒకటి తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందబోతుంది. అంటే మొత్తం మూడు సినిమాలు ఆయన కమిట్ అయ్యి ఉన్నాడు. వచ్చే ఏడాది ద్వితీయార్థంకు ఆ సినిమాలు పూర్తి అయితే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా ను ఆయన మొదలు పెట్టే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.