స్టార్ హీరోయిన్ స్కిన్ సమస్యతోనే డిలేనా?

Fri Oct 07 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Is the star heroine dealing with skin problems

గత కొంతకాలంగా ప్రముఖ స్టార్ హీరోయిన్ పై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సంతకాలు చేసి ఇంతలోనే అమెరికా ప్రయాణమవ్వడంతో ఈ రూమర్లు మరింతగా పెరిగాయి. సదరు స్టార్ హీరోయిన్ కి చాలా కాలంగా ఛర్మ సంబంధమైన సమస్యలున్నాయి. వాటి పరిష్కారం కోసమే అమెరికా వెళ్లిందని ప్రచారం మొదలైంది. అయితే ఇందులో నిజం ఎంత? అన్నది ఎవరికీ తెలీదు.అయితే ఇంతలోనే సదరు స్టార్ హీరోయిన్ అన్ని ప్రశ్నలకు జవాబిచ్చేందుకు రెట్టించిన ఎనర్జీతో తిరిగి వచ్చింది. ఇప్పటికే సెట్స్ లో ఉన్నవాటిని పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. కొత్తగా సెట్స్ పైకి వెళ్లాల్సిన వాటి గురించి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. రిలీజ్ కి రావాల్సిన వాటి కోసం ప్రచారానికి సై అనేసిందని తెలిసింది.

ప్రస్తుతం ఒక తెలుగు యువహీరోతో సినిమాని శరవేగంగా పూర్తి చేసేందుకు కాల్షీట్లను షెడ్యూలింగ్ చేసింది. అలాగే అమెరికన్ వెబ్ సిరీస్ భారతీయ వెర్షన్ కి తన పార్ట్ కాల్షీట్లను కేటాయించిందని తెలిసింది. ఇవి గాక చిత్రీకరణలు పూర్తి చేసుకుని రిలీజ్ లకు సిద్ధమవుతున్న రెండు సినిమాలకు ప్రమోషన్స్ బాధ్యతలను చేపట్టనుంది. ఈనెలలోనే అన్ని ప్రశ్నలకు సమాధానమివ్వనుంది. దీంతో అందరూ గప్ చుప్ అయ్యారు.

అన్ని పుకార్లకు ఇక చెక్ పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకుముందు మరో ప్రముఖ హీరోయిన్ ఒబేసిటీ గురించి ఇంతకంటే ఎక్కువగా ప్రచారమైంది. ఆ తర్వాత కెరీర్ పరంగానూ తను డల్ అయ్యింది. కానీ ప్రస్తుతం గాసిప్స్ లో నలుగుతున్న స్టార్ హీరోయిన్ కి కెరీర్ పరంగా ఎలాంటి డోఖా లేదు. కేవలం తెలుగు-హిందీ సినిమాలే కాదు హాలీవుడ్ లోనూ ఓ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.