వెండి తెర సీత ఓవర్ డోస్ తేడా కొడుతోందే?

Fri Sep 30 2022 11:32:08 GMT+0530 (India Standard Time)

Is the silver screen making a difference in Sita's over-dose?

వెండి తెరపై 'సీతారామం' చిత్రంలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ ఎంత అందంగా కనిపించిందో? చెప్పాల్సిన పనిలేదు. సిత పాత్రతో పాటు.. ముస్లీమ్ యువతి ప్రిన్సెస్  నూర్జహాన్ పాత్రలోనూ అంతకు మంచి అందంగా ఫోకస్ అయింది. సీతారామం క్లాసిక్ హిట్ గా నిలవడంలో ఆ రెండు పాత్రలు కీలక పాత్ర పోషించాయి. ఆ పాత్ర సృష్టికర్త హను రాఘవపూడికి ఎంత పేరొచ్చిందో? అంతకు మించి కీర్తిని మృణాల్ సీత ఆహార్యంతో దక్కించుకుంది.ఆమెకంటూ ప్రత్యేకమైన అభిమానులు ఏర్పడ్డారు. కానీ ఇప్పుడా  రీల్ సీత రియల్ సీత వేర్వేరు అంటూ చాలా వ్యత్యాసమే వెదుగుతున్నారు నెటి జనులు. మృణాల్ ఠాకూర్ కెమరా  బిహైండ్ ఫోజులు  చూస్తే అభిమానులకు  కిక్కు దొరకడం లేదు. రూప లావణ్యంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయంటూ ఇప్పటికే కొంత మంది అభిమానులు అభిప్రాయ పడ్డారు.

తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ లో మృణాల్ డిజైనర్ దుస్తులు...ఆహార్యంలో ఉన్న కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మృణాల్  తెరపై సాయి పల్లవి కాదని.. సమంత కంటే స్పైసీ అని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మృణాల్ గ్లామర్ డోస్ చూసి అంతా షాక్ అవుతున్నారు. సీతారమంలో మనం చూసిన సీతేనా?  ప్రిన్సెస్ నూర్జాహానేనా? అంటూ  సందేహిస్తున్నారు.

గ్లామర్ అప్పీరియన్స్ సహా ఓవర్ మ్యాకప్ అమ్మడికి నెగిటివ్ పబ్లిసిటీని తెచ్చిపెడుతుంది. చీరందంలో చూసిన మృణాల్ ని డిజైనర్ దుస్తుల్లో ఇలా కనిపించేసరికి మన సీత మనోహారమైన లుక్ ఏది? అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఆఫ్ స్ర్కీన్ లో మృణాల్ సహజం అందంతో కనిపించింది చాలా తక్కువ. ఇంతవరకూ ఓవర్ మ్యకప్ ఫోజులు..మ్యాకప్ లెస్  ఫోజుల్లోనే కనిపించింది.

రెండిటిని బ్యాలెన్స్  చేస్తే పెద్దగా వ్యత్యాసం కనిపించలేదు. సీత పాత్రలో  అందంగా కనిపించిందటే అదంతా హను రాఘవపూడి వల్ల మాత్రమే సాధ్యమైందంటున్నారు. ఈనేపథ్యంలో మృణాల్ పై మీమ్స్ కూడా పాప్ అప్  అవుతున్నాయి.  

మృణాల్ తొలుత టీవీ సీరియల్స్‌తో  అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ మంచి పేరు దక్కిచుకుంది. బాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేయడానికి ముందు  టీవీ వాణిజ్య ప్రకటనలలో నటించింది. ఆపై  రెండు హిందీ చిత్రాలలో కథానాయికగా నటించింది. అవి అంతగా అమ్మడికి కలసిరాలేదు. చివరగా  'సీతారామం'తో సక్సెస్ అందుకుని టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా వెలిగిపోతుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.