Begin typing your search above and press return to search.

కొత్త ఏటీటీ అల్లు వారిదేనా?

By:  Tupaki Desk   |   1 Dec 2020 7:45 AM GMT
కొత్త ఏటీటీ అల్లు వారిదేనా?
X
ఓటీటీతో పోల్చితే ఏటీటీ రిస్క్‌ కాస్త ఎక్కువ అయినా కూడా సినిమా సక్సెస్‌ అయితే పే పర్‌ వ్యూ పద్దతి కనుక నిర్మాతలకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఓటీటీకి సినిమాను అమ్మేస్తే ఫలితం తో సంబంధం లేకుండా ఒక ఫిక్స్‌ అమౌంట్‌ వస్తుంది. అందుకే టాలీవుడ్‌ లో ఏటీటీ వైపు కొందరు అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్‌ కు చెందిన ఒక నిర్మాత ఏటీటీ ఏర్పాటులో నిమగ్నమై ఉన్నారు అంటూ ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. మీడియా సర్కిల్స్‌ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆ నిర్మాత మరెవ్వరో కాదు బన్నీ వాసు.

ఈనెల 18వ తారీకున బన్నీ వాసు తన ఏటీటీని ప్రకటిస్తాడని అంటున్నారు. బన్నీ వాసు అంటే అల్లు ఫ్యామిలీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బన్నీకి అత్యంత ఆప్తుడు.. అల్లు అరవింద్‌ కు అత్యంత నమ్మకస్తుడిగా బన్నీ వాసుకు పేరు ఉంది. జీఏ2 బ్యానర్‌ పూర్తి బాధ్యతలను బన్నీ వాసుకు అప్పగించారు అంటే అల్లు అరవింద్‌ కు ఆయనపై ఉన్న నమ్మకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆయన ఏటీటీ ని ప్రారంభిస్తున్నాడు అంటే ఖచ్చితంగా దాని వెనుక అల్లు వారు ఉండి ఉంటారు అనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాలతో పాటు మీడియా సర్కిల్స్‌ లో జోరుగా వినిపిస్తుంది. అల్లు వారు ఇప్పటికే ఆహా ఓటీటీని రన్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో బన్నీ వాసు ను ముందు ఉంచి ఏటీటీని కూడా వారే నడిపించేందుకు సిద్దం అయ్యారు అనిపిస్తుంది.

ఓటీటీతో పాటు ఏటీటీలకు ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుంది. థియేటర్లకు జనాలు వెళ్లకుండా డిజిటల్‌ గానే సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే అల్లు అరవింద్‌ ముందు చూపుతో ఆహా ఓటీటీని ప్రారంభించారు. ఇదే సమయంలో ఏటీటీని కూడా సిద్దం చేస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పటికే శ్రేయాస్‌ ఈటీ అనే ఏటీటీ ఉంది. వర్మ కు చెందిన పలు సినిమాలు అందులో విడుదల అయ్యాయి. అయితే ప్రముఖులు పెట్టే ఏటీటీకి ఖచ్చితంగా మంచి పబ్లిసిటీ దక్కడంతో నిర్మాతలు తమ సినిమాల స్ట్రీమింగ్‌ కు ముందుకు వచ్చే అవకాశం ఉంది. బన్నీ వాసు తీసుకు రాబోతున్న ఏటీటీలోమొదటగా డర్టీ హరీని స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇండస్ట్రీలోకి రాబోతున్న కొత్త ఏటీటీకి ప్రేక్షకులు ఎలా వెల్‌ కమ్‌ చెప్తారు అనేది చూడాలి.