Begin typing your search above and press return to search.

ఆ డైరెక్ట‌ర్ కు చైతూ షాకిచ్చిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   20 Aug 2022 5:38 AM GMT
ఆ డైరెక్ట‌ర్ కు చైతూ షాకిచ్చిన‌ట్టేనా?
X
యంగ్ డైరెక్ట‌ర్ కు నాగ‌చైత‌న్య షాకిచ్చిన‌ట్టేనా? అంటే టాలీవుడ్ స‌ర్కిల్స్ లో నిజ‌మేన‌ని తెలుస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా యంగ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ డైరెక్ష‌న్ లో ఓ సినిమా ప‌ట్టాలెక్కాల్సింది. దీనికి సంబంధించిన క‌థా చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. 14 ప్ల‌స్ రీల్స్ బ్యాన‌ర్ లో ఈ మూవీని రామ్ ఆచంట‌. గోపీచంద్ ఆచంట నిర్మించాల‌ని ప్లాన్ చేశారు. ఇక అంతా ఓకే అయి సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌ని భావించారు. కానీ అది జ‌ర‌గ‌లేదు.

అదే స‌మ‌యంలో ప‌ర‌శురామ్ కు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబును డైరెక్ట్ చేసే అవ‌కాశం వెతుక్కుంటూ వ‌చ్చింది. మ‌హేష్ తో సినిమా చేయాల‌న్న‌ది ప‌ర‌శురామ్ డ్రీమ్ ప్ర‌య‌త్నించ‌కుండానే త‌న డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే అవ‌కాశం రావ‌డంతో నాగ‌చైత‌న్య ప్రాజెక్ట్ ని ప‌క్క‌న పెట్టి, నిర్మాత‌ల‌ని, చైతూని ఒప్పించి ప‌ర‌శురామ్ త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మ‌హేష్ బాబు సినిమాకు వెళ్లిపోయాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 ప్ల‌స్ రీల్స్ బ్యాన‌ర్ పై ఈ మూవీ 'స‌ర్కారు వారి పాట‌' పేరుతో తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే.

భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మ‌హేష్ బాబు అభిమానుల్ని తీవ్రంగా నిరాశ‌కు గురిచేసింది. క‌థ‌, క‌థ‌నాల్లో లోపాలు, సూప‌ర్ స్టార్ స్థాయికి త‌గ్గ క‌థ‌లో కావాల్సినంత స్ట‌ఫ్ లేక‌పోవ‌డం.. క‌థ‌నంలో ప‌ర‌శురామ్ త‌డ‌బాటుకు గురి కావ‌డం వంటి అంశాల కార‌ణంగా 'స‌ర్కారు వారి పాట‌' ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక నిరాశ‌ప‌రిచింది. భారీ సినిమాని ప‌ర‌శురామ్ డీల్ చేయ‌లేడ‌ని 'ఆంజ‌నేయులు' త‌రువాత మ‌రోసారి నిరేపించింది.

ర‌వితేజ‌తో గ‌తంలో ప‌ర‌శురామ్ 'ఆంజ‌నేయులు' చేసిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో త‌న‌కు ర‌వితేజ పెద్ద హీరో.. అంత మంది అవ‌కాశాన్ని అప్ప‌ట్లో ప‌ర‌శురామ్ స‌క్ర‌మంగా స‌ద్వినియోగం చేసుకోలేక‌పోవ‌డంతో ఆ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ గా నిలిచింది.

అప్పుడే పెద్ద ప్రాజెక్ట్ ని ప‌ర‌శురామ్ డీల్ చేయ‌లేడ‌నే ముద్ర ప‌డింది. ఆ త‌రువాత మ‌ళ్లీ ఇన్నాళ్లకు స్టార్ హీరో మ‌హేష్ ని డైరెక్ట్ చేసే అవ‌కాశం ద‌క్కినా మ‌ళ్లీ అదే పొర‌పాట్లు చేసి ప‌ర‌శురామ్ పెద్ద హీరోల‌ని డీల్ చేయ‌లేడ‌నే విమ‌ర్శ‌ల్ని సొంతం చేసుకున్నాడు.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌డు ప‌ర‌శురామ్ - నాగ‌చైత‌న్య ప్రాజెక్ట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌రుస ఫ్లాపుల్లో వున్న నాగ‌చైత‌న్య .. ప‌ర‌శురామ్ తో సినిమాకు రెడీ అవుతాడా? ఆ రిస్క్ చేస్తాడా? అన్న‌ది చ‌ర్చ జ‌రుగుతోంది. థాంక్యూ, లాల్ సింగ్ చ‌డ్డ వంటి సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్ని సొంతం చేసుకున్న నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం ప‌ర‌శురామ్ తో సినిమా చేసి రిస్క్ చేయాల‌నుకోవ‌డం లేద‌ట‌. ఈ నేప‌థ్యంలో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన‌ట్టుగానే వార్త‌లు వినిపిస్తున్నాయి.