నయన్ ని విఘ్నేష్ ఫ్యామిలీ అంతగా బలవంతం చేస్తోందా?

Mon May 10 2021 05:00:01 GMT+0530 (IST)

Is the Vignesh family making Nayan so strong?

అందాల నయనతార యువదర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఐదేళ్లుగా ఈ జంట ప్రేమకథ మీడియా కథనాల్లో హైలైట్ గా నిలుస్తోంది. ఇక ఈ జంట ప్రతిసారీ ఒకరిపై ఒకరు తమకు ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా పోస్టింగులతో అభిమానులకు చేరువలో ఉన్నారు. కలిసి పని చేస్తున్నారు. కలిసి నిర్మాతలుగా మారి సినిమాలు తీస్తున్నారు.ఇక ఈ జంట తొందర్లోనే పెళ్లికి సిద్ధమవుతోంది అంటూ చాలా సార్లు కథనాలొచ్చినా దానికి ఇంకా చాలా సమయం ఉందని చెబుతూ వస్తున్నారు. తాజా సమాచారం మేరకు నయన్ తన పెళ్లి విషయం ప్రస్థావించిన విఘ్నేష్ కుటుంబానికి ఒక మెలిక పెట్టిందని తెలుస్తోంది.

ప్రస్తుతం కరోనా మహమ్మారీ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో పెళ్లి వద్దు. ఈ సన్నివేశం ఏమంత బాలేదు. 2022లో దీనిపై ప్లాన్ చేద్దామని విఘ్నేష్ శివన్ కుటుంబీకుల్ని నయనతార కన్విన్స్ చేశారట. దీంతో ప్రియుడికి షాకిచ్చిన నయన్ అంటూ కోలీవుడ్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఇక ఇంతకుముందు విఘ్నేష్ నుంచి కూడా నయన్ విడిపోయిందని అందుకే పెళ్లి గురించి అడిగితే చెప్పడం లేదని తామరతంపరగా కథనాలొచ్చాయి. కానీ ఇటీవల నయన్ వేలికి ఉన్న నిశ్చితార్థపు ఉంగరాన్ని విఘ్నేష్ సోషల్ మీడియాల్లో ప్రదర్శించడం ద్వారా తమ బంధాన్ని ధృవీకరించారు.