ప్రభాస్ కు స్టార్ ప్రొడ్యూసర్ అందుకే షాకిచ్చారా?

Tue Aug 16 2022 11:00:00 GMT+0530 (IST)

Is that why the star producer shocked Prabhas?

పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ తిరుగులేని గుర్తింపుని సొంతం చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం ఆయనతో ఒక్క సినిమా చేసినా చాలు అని చాలా మంది భారీ చిత్రాల ప్రొడ్యూసర్లు వెంటపడుతున్నారు. కానీ ఓ స్టార్ ప్రొడ్యూసర్ మాత్రం ప్రభాస్ తో చేసుకున్న డీల్ ని అర్థాంతరంగా రద్దు చేసుకుని షాకివ్వడం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు భారీ సినిమాల్లో నటిస్తున్నాడు.అందులో మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న 'ఆదిపురుష్' చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 2023 జనవరి 12న ఈ మూవీని 3డీ ఫార్మాట్ తో పాటు 2డీ లోనూ అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటికే ఏర్పాట్లని కూడా మొదలు పెట్టారు. ఇక ఈ మూవీతో పాటు ప్రశాంత్ నీత్ తో  'సలార్' నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో 'ప్రాజెక్ట్ కె' సినిమాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ  రెండు సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. ఇదిలా వుంటే ఈ మూవీస్ అండర్ ప్రొడక్షన్ లో వుండగానే ఓ హారర్ ఎంటర్ టైనర్ ని మినిమమ్ బడ్జెట్ లో చేయాలని ప్రభాస్ దర్శకుడు మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీకి భారీ చిత్రాల నిర్మాత డీవీవీ దానయ్య ప్రొడ్యూసర్ ఇప్పటికే రూ. 50 కోట్లు ప్రభాస్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారట. సలార్ ప్రాజెక్ట్ కె సినిమాల చేస్తూనే గ్యాప్ లో హారర్ థ్రిల్లర్ కథగా తెరకెక్కనున్న సినిమాకు డేట్స్ కేటాయించాలని ప్రభాస్ ప్లాన్ చేసుకున్నాడట.

అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ డైలమాలో పడినట్టుగా తెలుస్తోంది. కారణం ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య తన అడ్వాన్స్ రిటర్న్ తీసుకున్నారని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కారణం ఏంటన్నది మాత్రం బయటికి రాలేదు. మారుతి రీసెంట్ గా 'పక్కా కమర్షియల్' పేరుతో ఓ సినిమా చేసిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్ గా నిలవడం వల్లే దానయ్య ధైర్యం చేయలేక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారా? అనే అనుమానాలు మాత్రం వినిపిస్తున్నాయి.

ఈ ప్రాజెక్ట్ నుంచి దానయ్య తప్పుకోవడంతో ముందుకొచ్చిన యువీ క్రియేషన్స్ ఓ ఓటీటీ సంస్థ ని భాగస్వామిగా వ్యవహరించమని ఆఫర్ ఇచ్చినా ఫలితం లేకుండాపోయిందట. అయితే ఫైనల్ గా పాపులర్ డిస్ట్రీబ్యూటర్ దగ్గరికి వెళ్లినా ప్రభాస్ షూటింగ్ టైమింగ్ పై క్లారిటీ లేకపోవడంతో తను కూడా చేతులు ఎత్తేసినట్టుగా తెలిసింది. దీంతో కొత్త ప్రొడ్యూసర్ కోసం ప్రస్తుతం వెతుకులాట మొదలు పెట్టారట. ప్రొడ్యూసర్ దొరికితేనే మారుతి - ప్రభాస్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది లేదంటే కష్టం అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.