సమంత ఇంత కష్టం అందుకోసమేనా?

Sun Jan 16 2022 11:59:21 GMT+0530 (India Standard Time)

Is that why Samantha is so difficult?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఈమద్య కాలంలో వర్కౌట్ వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తూ ఉంది. సాదారణంగానే సమంత ఫిజిక్ పై ఎక్కువ శ్రద్దను కనబర్చుతూ ఉంటారు అనే టాక్ ఉంది. ఆమె అందం మరియు ఫిజిక్ కు ఖచ్చితంగా ఆమె రెగ్యులర్ వర్కౌట్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె అంతగా ఫిజిక్ మెయింటెన్ చేస్తారు కనుక బాలీవుడ్ లో కూడా ప్రస్తుతం వరుస ఆఫర్లు ఆమెకు వస్తున్నాయి. రెగ్యులర్ కంటే ఈమద్య ఎక్కువగా వర్కౌట్స్ చేయడంకు ప్రథాన కారణం బాలీవుడ్ నుండి వచ్చిన ఒక వెబ్ సిరీస్ ఆఫర్ అంటూ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆమె ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులకు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో దగ్గర అయ్యింది. ఇప్పుడు మరో వెబ్ సిరీస్ ను ఆమె చేసేందుకు సిద్దం అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.హిందీలో అమెజాన్ వారు నిర్మించబోతున్న వెబ్ సిరీస్ కోసం సమంత కష్టపడుతున్నారు. వెబ్ సిరీస్ లో సమంత పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. అంతే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఆమె కనిపించాల్సి ఉంటుందట. అందుకే ఈ వెబ్ సిరీస్ కోసం సమంత వర్కౌట్స్ ను చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫిజిక్ స్ట్రాంగ్ గా ఉండేలా సమంత వర్కౌట్స్ చేస్తుంది కనుక విలన్ పాత్ర అయ్యి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ వెబ్ సిరీస్ లో సమంత లుక్ ఏంటీ.. ఎలా కనిపించబోతుంది.. పాత్ర ఏంటీ అనే విషయమై క్లారిటీ రాలేదు... కాని ఖచ్చితంగా వెబ్ సిరీస్ లో ఆమె ఆకట్టుకునే విధంగా ఉంటుందని మాత్రం అంటున్నారు.

ఇక సమంత ఇతర సినిమాల విషయానికి వస్తే తెలుగు లో ఈమె నటించిన శాకుంతలం ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు. గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన ఆ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇదే సమయంలో సమంత యశోద అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా షూటింగ్ చకచక జరుగుతోంది. తమిళంలో ఈమె నటించిన విఘ్నేష్ శివన్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలోనే అది కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది.