ఆ స్టార్ హీరో రేంజ్ పెంచుతున్నది నిర్మాతలేనా?

Fri Jul 01 2022 17:00:01 GMT+0530 (IST)

Is it the producers who are increasing the range of that star hero?

టాలీవుడ్ లో ఆయనో పెద్ద స్టార్. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు. ఆ స్టార్ ఆదేశించాలే గానీ..ప్లాప్ కంటెంట్ ని సైతం  హిట్ చేయగల  స్థాయిలో అభిమాన గణాన్ని కల్గి ఉన్నారు. సినిమా హిట్టైతే వందల కోట్లు..ప్లాప్ అయినా అదే స్థాయిలో నష్టాలు వస్తాయి. అప్పుడు మాత్రం ఆ స్టార్ హీరో మనసు చలించిపోతుంది.ఎంతలా అంటే?  పారితోషికంగా తీసుకున్న మొత్తాన్ని సైతం రిటర్న్ చేసేంత అంతగా. అందుకే ఆయనంత పెద్ద స్టార్ అయ్యారని అంటారు. చేసింది కొన్ని సినిమాలే అయినా వ్యక్తిగతంగా అభిమానుల మనసు తాకిన ఏకైన నటుడిగా పేరుంది. ఈ ఏడాది ఓ భారీ సక్సెస్ సైతం  అందుకున్నారు. ఆ సినిమా మంచి వసూళ్లని సాధించడంతో ఆయన మార్కెట్ ఫరిది పెరిగింది.

దీంతో నిర్మాతల వెంపర్లాట అంతకంతకు పెరిగిపోతుంది. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు..మూడు సినిమాలున్నాయి. ఒక సినిమా సెట్ లో ఉంది. మరో సినిమా ని లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వెనుక అనుకున్నది ముందుకొచ్చింది. ముందు అనుకున్న ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లింది. ఇప్పుడా సినిమా ఉంటుందా? ఊడుతుందా? అన్నది సందేహంగా మారింది.

అయినా ఆ స్టార్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఒక్కో సినిమాకి ఆయన 50 కోట్లు పారితోషికం తీసుకున్నన్న సంగతి వెలుగులోకి వచ్చింది. సమయాభావం వల్ల డేట్లు కేటాయించడం ఇబ్బందిగా ఉన్నా సరే ముందు మీరు ఒకే చెప్పండి..ఆ తర్వాత చూసుకుందామని అడ్వాన్సులు చెల్లించి చెకౌట్ అవుతున్నారుట.

ఆయన చిత్తశుద్దితో..నిబద్ధతో ఉన్న విషయాన్ని చెప్పినా వినకుండా అత్యుత్సాహం చూపించే నిర్మాతలతోనే  చిక్కు అంతా వచ్చిందన్నది  కొంత మంది నిర్మాతల విమర్శ. నిర్మాతలు అలా వెంట పడటం వల్లే 50 కోట్లు తీసుకుంటున్నారని..తీసుకున్న  సినిమాకి సవ్యంగా డేట్లు కేటాయించడంలో విఫలమవు తున్నారని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలాడుకుంటున్నారు.

అయితే ఇందులో ఆ స్టార్ హీరో తప్పేం లేదని తెలుస్తోంది. ఇస్తామంటే ఆయనెందుకు వద్దాంటాడు. డబ్బు అంటే ఎవరికి చేదు. అసలే ఇప్పుడు డబ్బుతో బోలెడన్ని అవసరాలున్నాయి. మును ముంందు ఇంకా అవసరం పడొచ్చు. ఇలా కొన్ని కారణాలు గా ఆ  స్టార్ పారితోషికం హైక్ చేయడం.. భారీగా అడ్వాన్సులు ఇస్తోన్న సంస్థల్ని ముందుగా లాక్ చేయడం వంటి వి జరుగుతున్నాయని ఫిలిం సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఇందులో వాస్తవాలు ఏంటి? అన్నది ఆ పెరుమాళ్లకే తెలియాలి.