ప్రాజెక్టు-కే సంక్రాంతికి రావడం రిస్కే?

Mon Mar 27 2023 10:38:03 GMT+0530 (India Standard Time)

Is it risky to come to Project-K Sankranthi?

ప్రభాస్ హీరో గా అనేక సినిమాలు లైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన హీరో గా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా ముందు విడుదలవుతుంది. తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా విడుదలవుతుంది. ఈ రెండు సినిమాలు విడుదలైన తర్వాత వచ్చే ఏడాది సంక్రాంతి కి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్టు కే సినిమా విడుదల అవడానికి సిద్ధమయింది.ఈ సినిమాని పాన్ వరల్డ్ సినిమా గా ముందు నుంచే చెబుతున్నారు. ఇక ఈ సినిమాని జనవరి 12వ తేదీ 2024వ సంవత్సరంలో విడుదల చేస్తామని ఇప్పటి కే అధికారిక ప్రకటన వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబు సినిమాని 13వ తేదీ జనవరి నెలలో విడుదల చేస్తామని మహేష్ బాబు సినిమా యూనిట్ కూడా ప్రకటించింది.

ఒక రకంగా మహేష్ బాబు వర్సెస్ ప్రభాస్ అన్నట్లు గా ఈ రెండు సినిమాలు పోటీ పడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రామ్ చరణ్ సినిమా కూడా సంక్రాంతి కి విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఒకవేళ రామ్ చరణ్ సినిమా కూడా సంక్రాంతికి వస్తే కనుక ప్రభాస్ సినిమా సంక్రాంతికి ప్లాన్ చేయడం రిస్క్ అని అంటున్నారు.

ఎందుకంటే ప్రభాస్ ప్రాజెక్టు కే సినిమా సైన్స్ ఫిక్షన్ అని ముందు నుంచి చెబుతున్నారు. సంక్రాంతి కి తెలుగు సహా ఇండియన్ మార్కెట్ బాగానే ఉంటుంది. కానీ అప్పుడు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. ప్రాజెక్టు k ఫిక్షనల్ స్టోరీ కాబట్టి ఫ్యామిలీస్ పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. అదేవిధంగా జరిగితే ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కే సినిమాని రెండు వారాలపాటు మరే సినిమా విడుదల లేకుండా చూసుకుని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందని లేకపోతే కలెక్షన్స్ విషయంలో ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు. అయితే ప్రాజెక్టు k సినిమా షూటింగ్ చాలా పెండింగ్ ఉండడంతో జనవరి విషయంలో పూర్తిస్థాయిలో నమ్మకాలు పెట్టుకోలేమని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ లేట్ అయినా సరే సింగిల్ గా రిలీజ్ చేసుకోవడమే నయమని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.