సర్కారు వారి పాట : నిజంగా అనుష్క కీలక పాత్ర చేసే అవకాశం ఉందా?

Sun Nov 22 2020 16:21:14 GMT+0530 (IST)

Is it really possible that Anushka will play a key role In Sarkar Vaari Pata

సూపర్ స్టార్ మహేష్ బాబు.. పరశురామ్ ల కాంబో మూవీ 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. 2021లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేసిన విషయం తెల్సిందే. గత రెండు మూడు రోజులుగా ఈ సినిమాలో కీలక పాత్రలో అనుష్క ను నటింపజేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు... అనుష్కలు చాలా ఏళ్ల క్రితం ఖలేజా సినిమాలో నటించారు. మళ్లీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఇద్దరు కలిసి నటించిందే లేదు.  అయితే ఇద్దరు ఇప్పుడు కలిసి నటించేందుకు సిద్దం అవుతున్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో నలుగురు నాలుగు రకాలుగా సోషల్ మీడియాలో విశ్లేషిస్తున్నారు.ఎక్కువ శాతం నెటిజన్స్ అప్పుడే అనుష్కకు ఇతర హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించే అవసరం రాలేదని.. ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తే పెద్ద హీరోల స్థాయి క్రేజ్ ను దక్కించుకుంటాయి. అంతటి క్రేజ్ ఉన్న సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాల్సిన అవసరం ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. గతంలో మహేష్ బాబుకు జోడీగా నటించిన అనుష్క ఇప్పుడు ఆయన సినిమాలో కీలక పాత్రలో నటించడం అంటే ఏమాత్రం సమంజసం కాదంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచారంపై దర్శకుడు పరశురామ్ లేదా చిత్ర యూనిట్ సభ్యులు స్పందిస్తే బాగుంటుందనే అభిప్రాయంను మహేష్ బాబు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.