Begin typing your search above and press return to search.

కొత్త తెలుగు ఓటీటీలు నిలదొక్కుకోవ‌డం సాధ్య‌మేనా?

By:  Tupaki Desk   |   27 Oct 2020 3:30 AM GMT
కొత్త తెలుగు ఓటీటీలు నిలదొక్కుకోవ‌డం సాధ్య‌మేనా?
X
ఓటీటీ రంగంలో పావులు క‌ద‌పాలంటే అదేమైనా సులువుగా వ‌ర్క‌వుట‌య్యేదేనా? అని ప్ర‌శ్నిస్తే .. అగ్ర నిర్మాత కం ఆల్ రౌండ‌ర్ బిజినెస్ మేన్ డి.సురేష్ బాబు ఏమ‌న్నారంటే.... అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్ .. హాట్ స్టార్ వంటివి అప‌రిమితంగా బ‌డ్జెట్ల‌ను ఖ‌ర్చు చేస్తున్నాయి. సొమ్ముల్ని మంచి నీళ్ల‌లా ఖ‌ర్చు చేస్తూ సినిమాల్ని కొంటున్నాయి. ఒరిజిన‌ల్ కంటెంట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఆ సొమ్ముల‌న్నీ ఎప్ప‌టికి రీక‌వ‌రీ అవుతాయో చెప్ప‌లేం. ముందు డ‌బ్బు జ‌ల్లేయాలి. ఆ త‌ర్వాత వ‌స్తుందో పోతుందో కూడా ఆలోచించ‌కూడ‌దు! అంటూ త‌న‌దైన బిజినెస్ మైండ్ తో ఎన‌లైజ్ చేశారు.

ఆ దెబ్బ‌కు తెలుగులో ఏదైనా ఓటీటీ స్టార్ట‌యినా అది నిల‌దొక్కుకోవ‌డం అంత సులువేమీ కాద‌ని అర్థ‌మైంది. ఆ క్ర‌మంలోనే బాస్ అల్లు అర‌వింద్ ఏమాత్రం వెన‌క‌డుగు వేయ‌కుండా ఆహా కోసం పక్కా ప్ర‌ణాళిక‌తో బ‌రిలో దిగారు. మాటీవీ నిర్మాత‌ల్లో ఒక‌రైన‌ మ్యాట్రిక్స్ ప్ర‌సాద్ తో క‌లిసి `ఆహా` పేరుతో ఓటీటీని ప్రారంభించారు. ఇందులో తెలుగు కంటెంట్ విరివిగా అందుబాటులోకి తెస్తున్నారు. సొంతంగా సిరీస్ లు సినిమాలు నిర్మించి ఇందులో రిలీజ్ చేయ‌డం అలాగే గీతా ఆర్ట్స్ సంస్థకు సంబంధించిన సినిమాల్ని అప్ లోడ్ చేయ‌డం .. ఎప్ప‌టికప్పుడు ట్యాలెంట్ ని వెతికి వంద‌ల కోట్లు ఇన్వెస్ట్ చేయ‌డం ఇదంతా నిరంత‌ర క్ర‌తువులా సాగుతోంది.

అయితే అల్లు అర‌వింద్ ఇంత చేసినా ఇంకా ఆహాకి స‌బ్ స్క్రైబ‌ర్లు ప‌రిమిత సంఖ్య‌లోనే ఉన్నారు. అమాంతం కోట్లాది మంది‌లో ఫాలోయింగ్ ఏమీ పెర‌గ‌లేదు. ఇక ఇలాంటి ప‌రిస్థితిలో మ‌రో తెలుగు ఓటీటీ లాంచింగ్ అంటూ హ‌డావుడి సాగుతోంది. ఈ ఓటీటీ టైటిలే `ఫిలిం`. ఇప్ప‌టికే రిలీజైన సేతుప‌తి పిజ్జా 2 సినిమాతో న‌వంబ‌ర్ ఒక‌టిన లాంచ్ అవుతుంద‌ని తెలుస్తోంది. పిజ్జా 2 రిలీజ్ స‌రే కానీ.. ఇందులో యంగేజ్ చేసే కంటెంట్ ఎంత ఉంది? అన్న‌ది చాలా ఇంపార్టెంట్. ఆరంభ‌మే మంచి కంటెంట్ క్రియేటివ్ స్ట‌ఫ్ తో ఆక‌ర్షిస్తే స‌బ్ స్క్రైబ‌ర్లు పెరిగే వీలుంటుంది. నానా చెత్తా ఇందులోకి తోసేయ‌కుండా సెల‌క్టివ్ గా ది బెస్ట్ ఇస్తే యువ‌త‌రం ఆక‌ర్షితుల‌య్యే వీలుంటుంది. పైపెచ్చు పెట్టుబ‌డులు అన్ లిమిటెడ్ గా వెద‌జ‌ల్లితేనే కంటెంట్ పుడుతుంది. మ‌రి ఈ కొత్త‌ `ఫిలిం-తెలుగు` యాప్ ఏమేర‌కు రీచ్ అవుతుంది? అన్న‌ది చూడాలి.