హాట్ బ్యూటీ కేవలం గ్లామర్ పాత్రలకేనా..?

Tue Jun 28 2022 09:31:31 GMT+0530 (IST)

Is hot beauty just for glamor roles ..?

టాలీవుడ్ లో హీరోయిన్లకు కొదవ లేదు. వారానికో కొత్త భామ ఇండస్ట్రీకి పరిచయమవుతుంది. అయితే ఈ గ్లామర్ ఫీల్డ్ లో మిగతా వారి నుంచి పోటీ తట్టుకొని నిలబడం అంటే అంత ఈజీ కాదు. తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని ఫిలిం మేకర్స్ దృష్టిలో పడినవారు మాత్రమే కొన్నాళ్లపాటు హీరోయిన్ గా రాణించగలుగుతారు.తమిళ మలయాళంలో హీరోయిన్లు మంచి పెర్ఫార్మన్స్ చేస్తే సరిపోద్దేమో కానీ.. తెలుగులో మాత్రం యాక్టింగ్ తో పాటుగా కాస్త గ్లామర్ గా కూడా కనిపించాల్సి ఉంటుంది. కాకపోతే కేవలం గ్లామర్ షో మాత్రమే చేస్తానంటే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నెట్టుకురాలేరు. ఏ హీరోయిన్ అయినా అన్ని రకాల పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వరుస అవకాశాలు అందుకోగలుగుతారు.కేవలం గ్లామర్ పాత్రలకే సరిపోయే హీరోయిన్లు కూడా కొంతమంది ఉన్నారు. అన్ని రకాల క్యారెక్టర్స్ వాళ్ళకి సరిపోవు. అలాంటి హీరోయిన్ల జాబితాలో అందాల భామ కేతిక శర్మ ని కూడా చెప్పొచ్చు.

పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటీ కేతిక. తొలి సినిమాతోనే తన అందచందాలతో యువ హృదయాలను తనవైపు ఆకర్షించింది. తన గ్లామర్ తో పిచ్చెక్కించింది. లిప్ లాక్ కిస్సింగ్ సీన్స్ - రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. ఈ క్రమంలోనే యువ హీరో నాగ శౌర్య సరసన 'లక్ష్య' సినిమా చేసింది కేతిక శర్మ. ఇందులోనూ ఆమెది గ్లామర్ పాత్రే.

అయితే ఈ ఉత్తరాది భామకు మొదటి రెండు సినిమాలు ఆశించిన సక్సెస్ అందించలేకపోయాయి. దీంతో హీరోయిన్ గా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోన్న కేతిక.. ఇప్పుడు మూడో చిత్రం 'రంగ రంగ వైభవంగా' పైనే అమ్మడు బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.న్యూ ఏజ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'రంగ రంగ వైభవంగా' చిత్రంలో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ సరసన కేతిక హీరోయిన్ గా నటించింది. గిరీశాయ దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ను బట్టి ఇందులోనూ కేతిక గ్లామరస్ గా కనిపించబోతోందని అర్థం అయింది. కొత్తగా లేదేంటి పాటలో వైష్ణవ్ తో కలసి ఫుల్ గా రొమాన్స్ చేసింది. ఈ సినిమా కుర్ర భామ కెరీర్ కు మంచి ఊపు తీసుకొస్తుందని భావిస్తోంది.ఇంతకుముందు చేసిన రెండు సినిమాలూ ప్లాప్ అవడంతో ఈ మూవీ సక్సెస్ ఆమెకి కీలకంగా మారింది.

మెగా హీరో సినిమా కావడం.. పేరున్న బ్యానర్ లో చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఈజీగా అందరి దృష్టిలో పడుతుంది. ఇది హిట్టు అయితే రాబోయే రోజుల్లో క్రేజీ ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. మరి రొమాంటిక్ బ్యూటీ కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి.