Begin typing your search above and press return to search.

బికినీ అనేది మినిమమా?

By:  Tupaki Desk   |   6 Jun 2023 10:00 PM GMT
బికినీ అనేది మినిమమా?
X
ఒకప్పుడు సినిమాలో హీరోయిన్లు అంటే నిండుగా, పద్దతిగా దుస్తులు ధరించి కనిపించేవారు. కేవలం సైడ్ డ్యాన్సర్లు మాత్రమే స్క్రీన్ షో చేస్తారు అనే భావన ఉండేది. అలా కొంచెం స్కిన్ షో చేస్తేనే వారిని చాలా తప్పుగా చూసేవారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. హీరోయిన్లే ముందు పొట్టి పొట్టి దుస్తులు వేసుకొని కనిపిస్తున్నారు. సరే, సినిమాల వరకు వేసుకున్నారంటే అది వృత్తి ధర్మం కాబట్టి వేసుకోవడం లో తప్పులేదు అనుకోవచ్చు. కానీ, బయట అంతకంటే దారుణంగా తిరగడం మొదలుపెట్టారు.

ముఖ్యంగా బికినీలు విషయానికి వస్తే, సినిమాలో హీరోయిన్ ఓ పది సెకన్ల పాటు బికినీలో కనపడుతోంది అంటేనే అమ్మో అని ఆశ్చర్యపోయేవారు. కానీ ఇప్పుడు బికినీ అనేది కూడా చాలా కామన్ అయిపోయింది. అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా, కనీసం కథ డిమాండ్ చేస్తోందా లేదా అనేది కూడా లేకుండా అందరూ ఎలాంటి మొహమాటం లేకుండా బికినీలు వేయడం మొదలుపెట్టారు. సరే అది కూడా సినిమా వరకే కదా అని సరిపెట్టుకుందాం అంటే కాదాయో. బయట కూడా ఎలాంటి సంకోచం లేకుండా బికినీ ధరిస్తున్నారు.

ముఖ్యంగా వెకేషన్ కి వెళ్లారంటే కచ్చితంగా బికినీ వేయాల్సిందే. బికినీ వేయనిది తమ ట్రిప్ పూర్తి అవ్వదు అనే భావన పెరిగిపోయింది. సరే, వారి పర్సనల్ ట్రిప్, వాళ్ల దుస్తులు వారి ఇష్టం అనుకుందామా అంటే, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఉండటం లేదు. ఈ మధ్యకాలంలో వెకేషన్ కి వెళ్లిన దాదాపు అందరు హీరోయిన్లు, ఏ ఒకరో ఇద్దరో మినహాయించి అందరూ బికినీ ధరించి, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినవారే.

ఇప్పుడు ఈ పోకడ హీరోయిన్ల దగ్గర నుంచి టీవీ యాంకర్లకూ పాకింది. టీవీల్లో ఒకప్పుడు యాంకరింగ్ మొదలైన కొత్తలో లేడీ యాంకర్లు చాలా పద్దతిగా కనిపించేవారు. చక్కగా, చీరలు, డ్రెస్సులోనే కనిపించేవారు. ఇప్పుడు వారు కూడా మారిపోయారు. టీవీ లో కూడా ఎక్స్ పోజింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. టీవీ దాకా అంటే ఒకే, వాళ్లు కూడా బయటకు వెళితే మినిమమ్ బికినీ వేయకుండా ఉండటం లేదు. స్టార్ యాంకర్ల నుంచి, ఇప్పుడిప్పేడే యాంకరింగ్ మొదలుపెట్టిన వారి వరకు అందరూ బికినీ వేయడం కామన్ గా మార్చేశారు. వారిలో పెళ్లై, పిల్లలు ఉన్నవారు కూడా ఉండటం గమనార్హం.

అందుకే వారు ఫోటోలు షేర్ చేయగానే, నెటిజన్లు కూడా విమర్శలు చేయకుండా ఉండలేకపోతున్నారు. అయితే, వారి అందాలను ఆస్వాదించేవారు కూడా కొందరు ఉన్నారు. వారు ఎలాంటి దుస్తులు వేసుకున్నా సమర్థించేవారు కూడా ఉన్నారు. వారి కంఫర్ట్ కి తగినట్లు వారు దుస్తులు వేసుకుంటే మీకేంటి ప్రాబ్లం అని వాదించేవారు కూడా ఉన్నారు.

వారికి నచ్చినట్లు వారు ఉంటే తప్పులేదు. కానీ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి,జనాలపై రుద్దాల్సిన అవసరం లేదు కదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ రోజుల్లో చూడిదార్ వేసుకోవడం ఎంత కాజ్యువలో, బికినీ కూడా అంతే క్యాజువల్ గా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.