వెంకీ న్యూ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందా?

Sun Jan 29 2023 20:00:01 GMT+0530 (India Standard Time)

Is Venkatesh new project cancelled

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం హిట్ సిరీస్ ఫేమ్ శైలేంద్ర కొలను దర్శకత్వంలో సినిమాని స్టార్ట్ చేశారు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లోనే తెరకెక్కబోతున్న ఈ సినిమాకి అప్పుడే సైంధవ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఈ సినిమాలో వెంకటేష్ తనకి భాగా సెట్ అయ్యే పోలీస్ ఆఫీసర్ పాత్రలో చాలా కాలం తర్వాత మళ్ళీ చేస్తున్నాడు. ఘర్షణ సినిమాలో వెంకటేష్ ని సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూసాం. తరువాత అలాంటి పాత్రలో చూడాలని ఫ్యాన్స్ చాలా కాలంగా కోరుకుంటున్నారు. అయితే అలాంటి కథతో వెంకటేష్ ని ఒప్పించే దర్శకుడు రాలేదని చెప్పాలి.ఇక చాలా కాలం తర్వాత అలాంటి సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో వెంకటేష్ ని శైలేంద్ర కొలను చూపించడానికి రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ పాత్రకి సంబంధించి ప్రీలుక్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో వెంకటేష్ కి ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దీఖ్ నటించబోతున్నాడు. తెలుగులో నవాజుద్దీన్ కి ఇది మొదటి సినిమా అని చెప్పాలి.

ఇదిలా ఉంటే దీనికంటే ముందుగా సురేష్ ప్రొడక్షన్ లో జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీతో వెంకటేష్ సినిమా చేయాల్సి ఉంది. అయితే అనుదీప్ చేసిన స్టొరీ లైన్ బాగానే ఉన్నా దానికోసం సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ వెర్షన్స్ మాత్రం సురేష్ బాబుకి నచ్చలేదని టాక్ వినిపిస్తుంది. చాలా వెర్షన్స్ విన్నా కూడా ఏది సురేష్ బాబు సంతృప్తి పరచలేదని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట.

ఈ నేపధ్యంలో అనుదీప్ తో చేయాలనుకున్న ప్రాజెక్ట్ ని సురేష్ బాబు పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో అనుదీప్ తన నెక్స్ట్ సినిమా కోసం సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి పనిచేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. సితార అంటే కచ్చితంగా మీడియం రేంజ్ హీరోతోనే ఆ ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పాలి. ప్రిన్స్ ఫ్లాప్ కారణం ఇప్పుడు అనుదీప్ కేవీ వెంకటేష్ తో సినిమా ఛాన్స్ పోగొట్టుకున్నాడని టాక్ వినిపిస్తుంది.