Begin typing your search above and press return to search.

హ‌నీరోజ్ కు 'వీర సింహారెడ్డి' ఫ‌స్ట్ తెలుగు ఫిల్మ్‌ కాదా?

By:  Tupaki Desk   |   28 Jan 2023 6:00 AM GMT
హ‌నీరోజ్ కు వీర సింహారెడ్డి ఫ‌స్ట్ తెలుగు ఫిల్మ్‌ కాదా?
X
నంద‌మూరి బాల‌కృష్ణ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ల్లో ద్విపాత్రాభిన‌యం చేసిన మూవీ 'వీర సింహారెడ్డి'. సంక్రాంతి బ‌రిలో భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీలో శృతిహాస‌న్ ఓ హీరోయిన్ గా న‌టించ‌గా మ‌రో కీల‌క పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టి హ‌నీరోజ్ న‌టించింది. సంక్రాంతి బ‌రిలో భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించింది. బాల‌య్య‌తో పాటు కీల‌క పాత్ర‌లో న‌టించిన వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ తో పాటు మ‌ల‌యాళ న‌టి హ‌నీరోజ్ కు కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది.

సినిమాలోనూ, ఈ మూవీ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ ల‌లో మ‌ల‌యాళ న‌టి హ‌నీరోజ్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిల‌వ‌డ‌మే కాకుండా బాల‌య్య‌తో క‌లిసి పెగ్ కొడుతూ పోజులిచ్చిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ గా మారి హ‌నీ రోజ్ ని టాలీవుడ్ లో మ‌రింత‌గా పాపుల‌ర్ అయ్యేలా చేశాయి. ఈ నేప‌థ్యంలో త‌న గురించి గూగుల్ లో ఆడియ‌న్స్ రికార్డు స్తాయిలో వెత‌క‌డం మొద‌లు పెట్టారు. దీంతో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌టికొచ్చాయి.

హ‌నీ రోజ్ 14 ఏళ్ల‌ వ‌య‌సులో అంటే 2005లో విన‌య‌న్ రూపొందించిన 'బాయ్ ఫ్రెండ్‌' మూవీతో కెరీర్ మొద‌లు పెట్టింది. ఇందులో త‌ను సెకండ్ హీరోయిన్. మూడ‌వ సినిమానే తెలుగు మూవీ. 2008లో శివాజీ హీరోగా ముత్యాల సుబ్బ‌య్య రూపొందించిన 'ఆల‌యం' మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది. ఆ త‌రువాత కొన్నేళ్ల పాటు మ‌ల‌యాళ‌, త‌మిళ‌, క‌న్న‌డ సినిమాల‌కే ప‌రిమితం అయింది. 2014లో వ‌రుణ్ సందేష్ న‌టించిన 'ఈ వ‌ర్షం సాక్షిగా' మూవీతో మ‌ళ్లీ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

కానీ కంటిన్యూ కాలేక‌పోయింది. మ‌ళ్లీ మ‌ల‌యాళ సినిమాల‌నే న‌మ్ముకుంది. మ‌ళ్లీ ఇన్నేళ్ల విరాం త‌రువాత బాల‌కృష్ణ న‌టించిన 'వీర సింహారెడ్డి'తో ముచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి ఎంట్రీ ఇచ్చింది. ఈ సారి భారీ సినిమా త‌గ‌ల‌డంతో హ‌నీ రోజ్ పేరు టాలీవుడ్ మొత్తం మారుమోగుతోంది. బాల‌య్య కూడా హ‌నీరోజ్ కు మ‌రో అవ‌కాశం ఇచ్చేలా వున్నారు. హ‌నీరోజ్ కూడా ఈ సారి టాలీవుడ్ పై ప్ర‌త్యేక క‌న్నేసిన‌ట్టుగా చెబుతున్నారు. మ‌రి రానున్న రోజుల్లో హ‌నీ రోజ్ తెలుగులో మ‌రిన్ని క్రేజీ ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.