Begin typing your search above and press return to search.

విశ్వక్ 11.. అసలు మ్యాటర్ ఇది!

By:  Tupaki Desk   |   30 May 2023 12:02 PM GMT
విశ్వక్ 11.. అసలు మ్యాటర్ ఇది!
X
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతి సినిమా లో ఒక కొత్త తరహా లుక్ తో దర్శనమిస్తున్నాడు. ఓ వైపు రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో వైపు ప్రయోగాత్మక మైన సినిమాలు కూడా చేస్తున్నాడు. అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంటు వెళుతున్న విశ్వక్ సేన్ రాబోయే తన 11వ సినిమా తో కూడా మరో కొత్త తరహా కిక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

కృష్ణ చైతన్య దర్శకత్వంలో , సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విశ్వక్ తన 11వ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఇక రెగ్యులర్ షూటింగ్ వేగంగా కొనసాగుతున్న సమయంలో సినిమా కు సంబంధించిన ఒక కొత్త గాసిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ చిత్రం కథ ఆంధ్రప్రదేశ్‌ కి చెందిన ఒక వివాదాస్పద రాజకీయ నాయకుడి పై ఆధారపడి తీస్తున్నారు అని టాక్ వచ్చింది. ఆ పొలిటికల్ లీడర్ కు సంబంధించిన కీలక మైన అంశాల ను సినిమా లో హైలెట్ చేయబోతున్నారని వార్తలు అల్లెస్తున్నారు. ఈ విషయం మీద ప్రత్యేకంగా చిత్ర యూనిట్ ని సంప్రదించగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు.

VS 11 కథ, సీన్స్.. ఏవి కూడా రియల్ లైఫ్ కు చెందినవి కావు అని, దర్శకుడు కృష్ణ చైతన్య కంప్లీట్ గా ఈ సినిమా ను ఫిక్షనల్ డ్రామాగా తెర పైకి తీసుకు వస్తున్నట్లు చెబుతున్నారు. యాక్షన్ తో పాటు మంచి ఎమోషన్ సినిమా లో హైలెట్ అవుతుందని తెలుస్తోంది.

పిరియాడ్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో విశ్వక్ మాస్ లుక్ కూడా ఆకట్టుకుంటుందని పోస్టర్ తోనే క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా ను సితార ఎంటర్టైన్మెంట్ మంచి నిర్మాణ విలువలతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. కృష్ణ చైతన్య మేకింగ్ ఈ సినిమా మరింత కొత్తగా ఉండబోతోందట. ఇక విభిన్నమైన సినిమాలతో క్రేజ్ పెంచుకుంటున్న కథానాయకుడు విశ్వక్ సేన్ ఈ సినిమా తో కూడా మరో బిగ్ హిట్ అందుకోవడం పక్కా అని అర్ధమవుతోంది.