సందీప్ వంగా ఇది నిజమా

Thu Dec 05 2019 13:46:04 GMT+0530 (IST)

Is This Is True Sandeep Vangaa?

ఫలానా కాంబినేషన్ ఓకే అయ్యింది అని కన్ఫామ్ చేయకముందే అది మీడియాలో హైలైట్ అవ్వడం ఒక్కోసారి ఆ దర్శకుడికి చిక్కుల్ని తెచ్చి పెడుతుంది. ఏదీ లేకుండానే సినిమా మొదలైపోతోందని హీరో ఫైనల్ అయ్యాడని రాసే వార్తలతో అందివచ్చిన అవకాశం చేజారుతుంది. ఈ విషయాన్ని బహిరంగంగా  మీటింగుల్లో చెప్పుకుని మరీ లబోదిబోమన్న పీఆర్వోలు ఉన్నారు.అయితే అలాంటిదే ఈ ప్రచారం. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో సంచలనాలు సృష్టించాడు తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. మొదటి సినిమాతోనూ టాలీవుడ్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాడు. అయితే అర్జున్ రెడ్డిలో ఘాటైన అదరచుంబనాలు.. నాయికను కొట్టే యారొగెంట్ హీరోని చూపించడం విమర్శలకు తావిచ్చింది. సందీప్ వంగా కాంట్రవర్శీ డైరెక్టర్ గా పాపులరయ్యాడు. ఏదైతేనేం ఈ ఇమేజ్ అతడికి ప్లస్ అవుతోందే కానీ మైనస్ అవ్వడం లేదు. కబీర్ సింగ్ చిత్రంతోనే షాహిద్ ని 300 కోట్ల క్లబ్ హీరోని చేసిన ఘనత మన సందీప్ కే దక్కింది. అందుకే మరో ఆలోచన అన్నదే లేకుండా రణబీర్ కపూర్ లాంటి ట్యాలెంటెడ్ స్టార్ సందీప్ వంగాకి రెండో సినిమా ఛాన్సిచ్చాడు. ఈ కాంబినేషన్ లో డెవిల్ సెట్స్ పైకి వెళ్లనుందని ప్రచారమైంది.

అయితే ఉన్నట్టుండి ఏమైందో ఈ సినిమా నుంచి రణబీర్ తప్పుకున్నాడని మరో ప్రచారం మొదలైంది.  రణబీర్ తప్పుకోవడంతో సందీప్ వేరొక హీరోని వెతుక్కోవాల్సిందేనని ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ లేదు. కబీర్ సింగ్ నిర్మాతలే వెంటనే సందీప్ వంగాకి అవకాశం ఇచ్చారు. ఇందులో రణబీర్ నిర్మాణ భాగస్వామి. మరి ఆ సంస్థల నుంచే అధికారిక వార్త రావాల్సి ఉంటుంది. ఇప్పటికి అయితే ఇది డమ్మీ ప్రచారమేనని భావించాల్సి ఉంటుంది. కనీసం సందీప్ అయినా ఇలాంటి రూమర్లను ఖండిస్తే బావుంటుందేమో!