Begin typing your search above and press return to search.

శాకుంతలం సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోనే!

By:  Tupaki Desk   |   22 March 2023 9:00 PM
శాకుంతలం సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోనే!
X
స్టార్ హీరోయిన్ సమంత శకుంతలగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. అయితే గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలాన్ని సినిమాగా రూపొందిస్తుండగా... దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. అది చూసినప్పటి నుంచి ప్రేక్షకులంతా సామ్ పౌరాణిక చిత్రం కోసం తెగ వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను డైరెక్టర్ అభిమానులతో పంచుకున్నారు.

శాకుంతలం సినిమాలో దుష్యంతుడి పాత్రకు ఫస్ట్ ఛాయిస్ దేవ్ మోహన్ కాదని తెలిపారు. దుల్కర్ సల్మాన్ ను ఈ పాత్ర కోసం తీసుకోవాలని దర్శకుడు భావించారట. కానీ దుల్కర్ సల్మాన్ అప్పటికే సీతారామం చిత్రం కోసం సంతకం చేయడంతో.. డేట్స్ క్లాష్ అవుతాయని భావించి ఈ సినిమాకు నో చెప్పారట.

అలాగే ఈ పాత్ర కోసం తాను తెలుగు హీరోలను ఎంపిక చేయకపోవడానికి కారణం టాలీవుడ్ హీరోలు ముందుకు రాకపోవడమే అని వెల్లడించారు. అలాగే తాను ఎవర్నీ బలవంతం చేయకూడదనుకొని మలయాళ నటుడిని తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

గతేడాదిలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల పోస్ట్ పోన్ చేశారు. కారణం ఏంటో తెలియకపోయినప్పటికీ సినిమాను రమూడు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చే నెలలో రిలీజ్ చేయబోతున్నారు.

నీలిమ గుణశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితి బాలన్, అల్లు అర్హ, వర్ణిణి సౌందరరాజన్, కబీర్ సింగ్ దుహా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో నటప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు కూడా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా.. సాయి మాధవ్ బుర్రా రచనా సహకారం అందించారు. అయితే ఈ సినిమాలో సామ్ ను శకుంతలగా చూపించేందుకు గుణ శేఖర్ ఎంతగానో కష్టపడ్డారు. ప్రతీ ఫ్రేమ్ లోనూ గొప్పగా చూపించేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకున్నారు. పౌరాణిక ప్రేమగాథలో ఒరిజినాలిటీ ఉండేందుకు ఒరిజినల్ నగలనే వాడారట చిత్రబృందం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.