ఆ స్టార్ డైరెక్టర్ అందించిన కథ.. మరో గ్రీకు కథ కాదుగా..??

Tue Jul 14 2020 23:29:47 GMT+0530 (IST)

The story provided by that star director .. isn't it another Greek story .. ??

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలను ఓకే చేసుకుంటూ రెడీ పెట్టుకుంటున్నాడు. చివరిగా విడుదలైన 'అర్జున్ సురవరం' హిట్ అవ్వడంతో నిఖిల్ మంచి జోష్ లోకి వచ్చాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కార్తికేయ-2లో నటిస్తున్నాడు. ఇప్పుడా కార్తికేయ-2 సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగులో ఉన్నప్పుడే హీరో నిఖిల్ తన తదుపరి సినిమా గురించి ప్రకటించాడు. కెరీర్ మొదటి నుండి కాన్సెప్ట్ లతో కూడిన సినిమాలు చేస్తున్న నిఖిల్ తాజాగా '18 పేజీలు' సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కథ స్క్రీన్ ప్లేను అందిస్తుండటం విశేషం. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో హీరో నిఖిల్ మతిమరుపుతో బాధపడే యువకుడి పాత్రలో కనిపించనున్నాడట. ఈ మతిమరుపు కాన్సెప్ట్ పై చాలా సినిమాలు వచ్చాయి. మరి ఇందులో కొత్తగా ఏముంటుంది అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే హీరో నాని నటించిన హిట్ మూవీ 'భలే భలే మగాడివోయ్' సినిమా నుండి స్ఫూర్తి పొంది ఉంటారని సినీవర్గాల టాక్. ఎందుకంటే డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్ తో రూపొందించిన 'కుమారి 21ఎఫ్' మూవీ ఓ గ్రీకు మూవీ నుండి స్ఫూర్తి పొందిందే అని వార్తలు వచ్చాయి. అలాగే మరి సుకుమార్.. ఈ కాన్సెప్ట్ కూడా ఎక్కడి నుండో తెచ్చే ఉంటాడని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కానీ ఎన్ని వచ్చినా ఈ సినిమాలో ఇంకాస్త వెరైటీ ఉండబోతుందని అంటోంది చిత్రయూనిట్. చూడాలి మరి ఈ '18 పేజీలు' ఎలా ఉండబోతుందో..!!