Begin typing your search above and press return to search.

శ్రీరెడ్డి మళ్ళీ టెన్షన్ పుట్టిస్తోందా..?

By:  Tupaki Desk   |   4 March 2021 5:38 AM GMT
శ్రీరెడ్డి మళ్ళీ టెన్షన్ పుట్టిస్తోందా..?
X
టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరువిప్పి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నటి శ్రీ రెడ్డి. ఈ క్రమంలో పలువురు నటీనటులపై దర్శక నిర్మాతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పద నటిగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ మీద ఆమె చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. ఈ క్రమంలో మోస్ట్ కాంట్రవ‌ర్శీ బ్యూటీ అని పేరు తెచ్చుకున్న శ్రీరెడ్డి.. ఇప్పుడు ''క్లైమాక్స్'' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ''క్లైమాక్స్''. 'డ్రీమ్' సినిమాతో పలు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్ లో అవార్డ్స్ అందుకున్న కె.భవాని శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కైపాస్ ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ప‌తాకంపై పి.రాజేశ్వ‌ర్ రెడ్డి - కె.క‌రుణాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెటైరికల్ థ్రిల్ల‌ర్ గా రానున్న ఈ చిత్రంలో శ్రీరెడ్డి కీల‌క పాత్ర పోషించింది. ఈ సినిమా మార్చి 5న విడుదల కానుంది.

'క్లైమాక్స్' సినిమాలో శ్రీరెడ్డి యాక్ట్ చేయ‌డం.. అది కూడా టాలీవుడ్ లో ఈ బ్యూటీ చేసిన హ‌డావుడి త‌రువాత వస్తున్న సినిమా కావ‌డంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ గ్రూపుల్లో ఉత్కంఠ న‌డుస్తోందని తెలుస్తోంది. ఇందులో విజయ్ మాల్యా క్యారెక్ట‌ర్ ని పోలిన ఓ బిజినెస్ టైకూన్ గా రాజేంద‌ర్ ప్ర‌సాద్ క‌నిపించ‌నున్నాడు. పృథ్వీరాజ్‌ - శివ‌ శంక‌ర్ మాస్ట‌ర్ - సాషా సింగ్‌ - ర‌మేష్‌ - చందు ఇతర ఇతర పాత్ర‌లు పోషించారు. అయితే ఎంత‌మంది ఉన్నా శ్రీరెడ్డి ఈ సినిమాలో న‌టిస్తుండ‌టంతో ఫిల్మ్ న‌గ‌ర్ ఎటెన్ష‌న్ 'క్లైమాక్స్' మీద బాగానే ఉందని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో శ్రీరెడ్డి ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.