ఆరెంజ్ సీక్వెల్ రిస్క్.. ఇలా చేస్తే బెటారేమో?

Fri Mar 31 2023 10:17:22 GMT+0530 (India Standard Time)

Is Sequel of Orange Film is Risk

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ ఆరంభంలో చేసిన మూడవ సినిమా ఆరెంజ్. 2010లో రిలీజ్ అయిన ఈ సినిమా చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా ఉండిపోయింది. మంచి లవ్ స్టోరీని సరికొత్త కోణంలో ఈ సినిమాలో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.అయితే ఒకే రకమైన ప్రేమ కథలు చూడటానికి అలవాటు పడిపోయిన ఆడియన్స్ ఆరెంజ్ సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ కి కనెక్ట్ కాలేదు. దీంతో ఈ సినిమా డిజాస్టర్ కేటగిరీలోకి వెళ్లిపోయింది. అయితే టీవీలలో ఇప్పటికీ ఒక వర్గం ప్రేక్షకులు ఆ సినిమాని చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు.

ముఖ్యంగా ఈ జనరేషన్ యూత్ అయితే ఆరెంజ్ సినిమాని ఒక కల్ట్ క్లాసిక్ గా ఆభివర్ణిస్తూ ఉంటారు. రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని రీ రిలీజ్ చేశారు. మూడు రోజులపాటు ప్రదర్శించిన ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ అందుకొని రికార్డులు సృష్టించింది. దీంతో ఇంతవరకు ఈ సినిమాపై ఉన్న డిజాస్టర్ ఇమేజ్ దూరమైంది అని చెప్పాలి.

ఈ సినిమాకి మంచి ఆదరణ రావడంతో ఇప్పుడు సీక్వెల్ అనే మాట తెరపైకి వచ్చింది. నాగబాబు సీక్వెల్ పై దర్శకుడితో చర్చలు జరిపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే అప్పట్లో ఒక రామ్ చరణ్ కాకుండా ఎవరైనా కొత్త హీరోతో ఈ సినిమా చేసి ఉంటే మంచి హిట్ అయ్యేది అనే మాట కూడా వినిపించింది. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో చెర్రీ నుంచి రెగ్యులర్ ఆడియన్స్ తో పాటు అభిమానులు కూడా కాస్త డిఫరెంట్ అండ్ హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలను చూడటానికి ఇష్టపడతారు.

 అవుట్ ఆఫ్ ది బాక్స్ గా ఉంటూ యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలైతే కచ్చితంగా ఆదరిస్తారు. ఒక మాస్ హీరో ఇమేజ్ వచ్చిన తర్వాత ప్రేమ కథ చిత్రాలు చేయడం కచ్చితంగా రిస్క్ అవుతుంది. మరి ఆరెంజ్ సీక్వెల్ మూవీ ని రామ్ చరణ్ తోనే ప్లాన్ చేస్తారా లేదంటే ఎవరైనా కొత్త హీరోతో తెరకెక్కించే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాలి.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.