Begin typing your search above and press return to search.

భాయ్ జాన్ కాటమరాయుడా కాదా?

By:  Tupaki Desk   |   26 Jan 2023 10:00 PM GMT
భాయ్ జాన్ కాటమరాయుడా కాదా?
X
బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం కిసీకా భాయ్ కిసీకా జాన్ . ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ లో హీరోయిన్ గా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తోంది. అలాగే సీనియర్ హీరో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో వెంకీ, పూజా అన్న చెల్లెళ్లుగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక జగపతిబాబు విలన్ గా నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ ప్రచార చిత్రం కంప్లీట్ గా యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారు. అలాగే ఈ టీజర్ లో పూజాహెగ్డే బతుకమ్మ ఎత్తినట్టు చూపించారు.

పక్కనే వెంకటేష్ కూడా బతుకమ్మతో నడుచుకుంటూ వెళ్తున్న సీన్ ను చూపించారు. మొత్తంగా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా సినిమా సాగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

ఇక ఈ ట్రైలర్ చూస్తే కథ పట్ల ఒక అవగాహన ఇచ్చేశారు మేకర్స్. ముందు నుంచి ఇది కాటమరాయుడు రీమేక్ అనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో అజిత్ చేసిన వీరంని తెలుగులో పవన్ కాటంరాయుడు, కన్నడలో దర్శన్ ఓడయా పేరుతో తెరకెక్కియించి బోల్తా పడ్డారు. కేవలం తమిళంలో మాత్రమే సూపర్ హిట్ అయ్యింది. అయితే దీన్నే చాలా మార్పులు చేసి కండల వీరుడు హిందీ వెర్షన్ చేస్తున్నాడన్న ప్రచారం ముందు నుంచి ఉంది.

కానీ వెంకటేష్ ఇందులో పూజా హెగ్డే అన్నయ్యగా నటిస్తున్నాడు. ఒరిజినల్ లో ఈ క్యారెక్టర్ లేదు. సల్మాన్ పక్కన ముగ్గురు తమ్ముళ్లు మాత్రమే వీరంతో ప్రధాన పోలిక. పైగా భాయ్ జులపాల జట్టు మీసంతో ఒకసారి, క్లీన్ షేవ్ తో మరోసారి ఇలా రెండు షేడ్స్ లో దర్శనమిచ్చాడు.

ఇవన్నీ చూస్తుంటే సందేహాలు వస్తున్నాయి కానీ.. సినీ వర్గాలు వేరని అంటున్నాయి. సో ఈ సస్పెన్స్ తీరాలంటే రంజాన్ పండగ దాకా ఆగాల్సిందే. వెంకటేష్, పూజా హెగ్డే, జగపతిబాబు ఉండటం వల్ల కిసీకా భాయ్ కిసీకా జాన్ మీద తెలుగు ఆడియన్స్ లోనూ ఆసక్తి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.